Hrithik Roshan: క్రిష్ 4 కోసం మరోసారి తన సింగింగ్ టాలెంట్ చూపించనున్న… హృతిక్ రోషన్

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో  హృతిక్ రోషన్… పలు సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించికున్నాడు. క్రిష్, ధూమ్ 2, వార్ వంటి చిత్రాలతో హృతిక్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ఆయన డాన్స్ లను అభిమానులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలానే బాడీని మెయిన్ టైన్ చేయడంలో కూడా హృతిక్ కి సాటిలేరని చెప్పాలి. అయితే తాజాగా ఆయన క్రిష్ 4 సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘క్రిష్‌’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా… ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 28, 2021 10:57 am
Follow us on

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో  హృతిక్ రోషన్… పలు సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించికున్నాడు. క్రిష్, ధూమ్ 2, వార్ వంటి చిత్రాలతో హృతిక్ తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా ఆయన డాన్స్ లను అభిమానులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలానే బాడీని మెయిన్ టైన్ చేయడంలో కూడా హృతిక్ కి సాటిలేరని చెప్పాలి. అయితే తాజాగా ఆయన క్రిష్ 4 సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘క్రిష్‌’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా… ఈ యేడాది జూన్ 23న ‘క్రిష్‌ -4’ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశాడు హృతిక్ రోషన్.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్‌ రోషన్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ‘క్రిష్‌’ సీరిస్ చిత్రాలన్నింటికీ హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ‘క్రిష్‌ -4’ చిత్రానికి కూడా ఆయనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటరెస్టింగ్ విషయాన్ని తెలిపారు రాజేశ్.

”నా సోదరుడు స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేయగానే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెడతానని అన్నారు. అలానే ఈ సినిమాలో ఓ పాటను ఖచ్చితంగా హృతిక్ రోషన్ తో పాడిస్తా” అని రాజేశ్ చెప్పారు. గతంలో కూడా హృతిక్ రెండు సినిమాలలో తన సింగింగ్ టాలెంట్ చూపించారు.  ‘జిందగీ నా మిలేగీ దొబారా’, ‘కైట్స్’ చిత్రాల్లో పాట పాడగా… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమ సొంత చిత్రంలో హృతిక్ పాట పాడబోతున్నాడు. కాగా  హృతిక్ రోషన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ లోనూ… దీపికా పదుకొనేతో  ‘ఫైటర్’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ‘క్రిష్ 4’ సినిమా కోసం  ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.