https://oktelugu.com/

Hrithik Roshan Marriage: ఆ స్టార్ తో ఈ యంగ్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్ !

Hrithik Roshan Marriage: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. నటి సబా ఆజాద్‌తో కలిసి హృతిక్ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించడంతో పాటు ఆమె మెడలో తాళి కూడా కట్టనున్నాడు. పైగా సబాను ఇంటికి సైతం తీసుకెళ్లాడు. ఆ మధ్య హృతిక్ కుటుంబంతో కలిసి లంచ్ చేసిన సబా ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా. తాజాగా వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 12, 2022 / 12:41 PM IST
    Follow us on

    Hrithik Roshan Marriage: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. నటి సబా ఆజాద్‌తో కలిసి హృతిక్ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించడంతో పాటు ఆమె మెడలో తాళి కూడా కట్టనున్నాడు. పైగా సబాను ఇంటికి సైతం తీసుకెళ్లాడు. ఆ మధ్య హృతిక్ కుటుంబంతో కలిసి లంచ్ చేసిన సబా ఫొటోలు వైరల్ అయ్యాయి కూడా.

    Hrithik Roshan and-Saba Azad

    తాజాగా వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది. మే సెకండ్ వీక్ లో వీరి పెళ్లి ఉండే అవకాశం ఉందట. హృతిక్ రోషన్ ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. నిజంగా హృతిక్ జీవితం నమ్మశక్యం కానిది. హృతిక్ రోషన్ కి చిన్నతనంలో ఎక్కువగా నత్తి ఉండేది. ఆ నత్తి బాధతో అతను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు. పైగా అతనికి ఇంకా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.

    Also Read:  షాకింగ్: రాధేశ్యామ్ 2వ రోజు కలెక్షన్లు తెలిస్తే మతి పోవాల్సిందే?

    అయితే ఏం ? పుట్టుకతో వచ్చిన ఆ లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్. హీరో అయిన తొలిరోజుల్లో అసలు హృతిక్ ను హీరోగా భావించేవాళ్ళు కాదు. అయితే, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు హృతిక్. మీకు తెలుసా ? హృతిక్ తొలి పారితోషికం కేవలం రూ.100. తన ఆరేళ్ల వయసులో 1980లో వచ్చిన ‘ఆశా’ అనే సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు.

    hrithik roshan and saba azad marriage

    ముఖ్యంగా హృతిక్‌ తెర పై డ్యాన్స్‌ చేయడం చూస్తే… ‘అబ్బ…ఏం చేస్తన్నాడురా.. అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా ? లేవా ? అని అందరూ ఆశ్చర్య పోతుండేవాళ్లు. ఇక హీరోగా అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

    Also Read: తగ్గేదేలే అంటూ రెచ్చిపోయిన ‘రష్మీ- సుడిగాలి సుధీర్’ !

    Tags