Hari Hara Veera Mallu: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ సూర్య మూవీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఏ ఏం రత్నం గారు..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఖుషి మరియు బంగారం సినిమాలు వచ్చాయి..వీటిలో ఖుషి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది..మల్లి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా కావడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ తొలిసారి జానపద తరహా సినిమాలో నటించడం తో ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ మేకింగ్ వీడియో లో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాట సన్నివేశాలు చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు..తమ హీరో ని ఈ స్థాయిలో చూసి చాలా కాలం అయ్యింది అని..ఈ సినిమా కరెక్ట్ గా తీస్తే పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించడం ఖాయం అని పవన్ కళ్యాణ్ అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..కరోనా కారణంగా చాలా కాలం బ్రేక్ తీసుకొని ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో ఘనంగా ప్రారంభం అయ్యింది,ఇంటర్వెల్ లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు..పవన్ కళ్యాణ్ దాదాపుగా 1000 మందితో చేసే ఈ పోరాట సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలవనుంది అట..కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ మాత్రమే కాదు..సినిమా మొత్తం కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో పవన్ కళ్యాణ్ ని ఇదివరకు అభిమానులు ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమా లో డైరెక్టర్ క్రిష్ చూపించబోతున్నాడు అని తెలుస్తుంది, ఇప్పటికే 40 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అట.

Also Read: జబర్దస్త్ షోపై ప్రముఖ కమెడియన్ సెటైర్లు..!
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు అయినా వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన టికెట్ రేట్స్ వల్ల తీవ్రంగా నష్టపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..భీమ్లా నాయక్ సినిమా కి అయితే కేవలం 100 , 80 టికెట్ రేట్స్ మాత్రమే నడిచాయి..పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా కి లాభాలు రావాలి అంటే కచ్చితంగా టికెట్ రేట్ కనీసం 150 రూపాయిల అయినా ఉండాలి,దానికి తోడు 5 వ షో కూడా ఈ సినిమాకి లేకపోవడం తో దాదాపుగా 30 కోట్ల రూపాయిలు అదనంగా వచ్చే వసూళ్లు భీమ్లా నాయక్ నష్టపోయింది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.. కానీ హరి హర వీరమల్లు భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈ సినిమాకి హైక్ వచ్చే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయిలు దాటి , 20 శాతం షూటింగ్ ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకొని ఉంటె కచ్చితంగా హైక్ ఇస్తాము అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..#RRR చిత్రానికి కూడా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైక్ కి అనుమతించింది, ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాకి కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైక్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read: RRR వల్ల IPL కి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా??