Pawan Kalyan Rythu Bharosa Yatra : జనసేనాని పవన్ కళ్యాణ్ కదిలారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడిచారు. ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ‘భరోసా యాత్ర’ చేపట్టారు. కొత్త చెరువులో పవన్ కల్యాన్ ఈ యాత్రను ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం చనిపోయిన కౌలు రైతు భార్య సుజాతకు రూ. లక్ష ఆర్థిక సాయం చెక్కును అందజేశారు.

తన భర్త చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదని.. ఎవరూ పట్టించుకోలేదని పవన్ వద్ద సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరుఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ ఆమెకు హామీ ఇచ్చారు.
ఇక అనంతరం ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామానికి పవన్ చేరుకున్నారు. అక్కడ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పూలకుంట, మున్నీల గ్రామాలకు చేరుకొని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించారు. అనంతరం సాయంత్రం మన్నీల గ్రామంలో పవన్ రచ్చబండ నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే జనసేన టీం ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను ప్రభుత్వం నుంచే సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలిసి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇబ్బందుల్లో ున్న వారికి సాయం చేస్తూ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.

ఇప్పటికే ఈ నిధుల కోసం తనకు ‘భీమ్లానాయక్’ సినిమా ద్వారా వచ్చిన పారితోషికం నుంచి రూ. 5 కోట్లను పార్టీకి విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ నిధులతో నేడు అనంతపురం పాత జిల్లాలోని కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేస్తున్నారు.

[…] Jagan New Cabinet: జగన్‌కు మొదటి నుంచి ఓ పేరు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అదే విదేయులకు పెద్ద పీట వేస్తారనేది. అంటే తనను నమ్ముకున్న విధేయులకు వైఎస్ మాట ఇచ్చారంటే ఇక తిరుగు ఉండదు. ఆ తర్వాత జగన్ కూడా ఇలాగే తన విధేయులకు హామీలు ఇచ్చి మొదట్లో నిలబెట్టుకున్నారు కూడా. అయితే రెండోసారి కేబినెట్ లో మార్పులు చేసినప్పుడు మాత్రం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. […]