https://oktelugu.com/

Bigg Boss Telugu 8 :  బిగ్ బాస్ 8′ లో గంగవ్వ కి ఇదే చివరి వారం..నామినేషన్స్ లోకి రాలేదు..ఆరోగ్య సమస్యలు లేవు..మరి అసలు కారణం ఏమిటి?

ఎలిమినేట్ అవ్వాల్సిన ఈమెని హౌస్ మేట్స్ ఎవ్వరూ నామినేట్ చేయరు, బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగ్స్ ఇలాంటి అనేక కారణాల వల్ల బాగా పడిపోయాయి. గంగవ్వ హౌస్ లో ఉన్న ఒక్కటే , లేకపోయినా ఒక్కటే అనే ఉద్దేశ్యంతో ఈ వారం ఆమెని బయటకి పంపేందుకు బిగ్ బాస్ టీం రంగం సిద్ధం చేసిందట.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 08:45 PM IST

    Gangavva

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు ‘గంగవ్వ’. సీజన్ 4 లో ఈమె కొన్నాళ్ళు హౌస్ లో కొనసాగి, ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రీత్యా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. అలాంటి కంటెస్టెంట్ ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు, ఆమెకు బదులుగా వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉండుంటే చాలా బాగుండేది కదా, అనవసరంగా బిగ్ బాస్ యాజమాన్యం కి డబ్బులు నష్టం తప్ప, మరొకటి లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగానే గంగవ్వ ఈ సీజన్ లో అనవసరంగా పాల్గొన్నది అని అందరికీ అనిపించింది. ఈమె టాస్కులు ఎలాగో ఆడదు, కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా అందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ దెయ్యం ప్రాంక్ తప్ప, ఈమె నుండి చెప్పుకోదగ్గ కంటెంట్ ఒక్కటి కూడా రాలేదు.

    ఎలిమినేట్ అవ్వాల్సిన ఈమెని హౌస్ మేట్స్ ఎవ్వరూ నామినేట్ చేయరు, బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగ్స్ ఇలాంటి అనేక కారణాల వల్ల బాగా పడిపోయాయి. గంగవ్వ హౌస్ లో ఉన్న ఒక్కటే , లేకపోయినా ఒక్కటే అనే ఉద్దేశ్యంతో ఈ వారం ఆమెని బయటకి పంపేందుకు బిగ్ బాస్ టీం రంగం సిద్ధం చేసిందట. గంగవ్వకి వారానికి 2 లక్షల 50 వేలు ఇస్తున్నారట. ఇప్పటి వరకు ఆమె నాలుగు వారాలు హౌస్ లో కొనసాగింది. అంటే 10 లక్షల రూపాయిలు వచ్చిందన్నమాట. ఇది ఆమెకు ఉచితంగా ఇస్తున్నట్టే, ఇంకొక్క వారం కొనసాగితే మాత్రం బిగ్ బాస్ టీం నష్టాలతో నిండా మునిగిపోయే ప్రమాదం ఉందట.

    ఈ వారం నామినేషన్స్ లోకి యష్మీ, గౌతమ్,నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, హరి తేజ , విష్ణు ప్రియ వచ్చారు. వీరిలో ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం యష్మీ, పృథ్వీ, హరితేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. యష్మీ , పృథ్వీ గేమ్స్ అద్భుతంగా ఆడవాళ్లు, అదే విధంగా హౌస్ లో గొడవలతో బోలెడంత కంటెంట్ ఇస్తున్నారు. మరో వైపు వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉంది. ఈ వారం లో హరితేజ కూతురు హౌస్ లోకి వస్తే బోలెడంత కంటెంట్ వస్తుంది. టీఆర్ఫీ రేటింగ్స్ మళ్ళీ పైకి లేచే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే షో కి పెద్ద నష్టం కనుక, గంగవ్వ ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే కారణంతో బయటకి పంపేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం పై బిగ్ బాస్ టీం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.