https://oktelugu.com/

Ravi Teja: రవితేజ కోసం రాసుకున్న కథలోకి పవన్ కళ్యాణ్ ఎలా వచ్చాడు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయనని మనకు చాలా గొప్పగా పరిచయం చేస్తాయి... ఇక ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను మాత్రం వదిలిపెట్టకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 10:10 AM IST

    Ravi Teja(1)

    Follow us on

    Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ హీరో ఇమేజ్ కానీ అప్పుడున్న పరిస్థితులు కానీ లేదంటే డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడం వల్ల కానీ కొంతమంది హీరోలు కొన్ని మంచి కథలను వదిలేసుకుంటారు. దాని వల్ల వాళ్లు చాలా వరకు నష్టపోతే మరికొంతమంది మాత్రం ఆ కథలతో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో రవితేజ భారీ సక్సెస్ లను అందుకున్న విషయం మనకు తెలిసిందే. కానీ రవితేజ చేయాల్సిన ఒక సినిమాని పవన్ కళ్యాణ్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న విషయం మనలో చాలా మందికి తెలియదు.

    ముఖ్యంగా రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘మిరపకాయ్’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ రవితేజ చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ బాలీవుడ్ లో.హిట్ అయిన ‘ దబాంగ్ ‘ సినిమాని రవితేజతో రీమేక్ చేయాలని చూశాడు. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ ఆ సినిమా రైట్స్ ని తీసుకొని హరీష్ శంకర్ తో ఈ సినిమా చేయమని చెప్పాడు. అయితే రవితేజతో చేయాలనుకున్న ప్రాజెక్టు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లడంతో హరీష్ శంకర్ కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

    పవన్ కళ్యాణ్ లేకపోతే గబ్బర్ సింగ్ సినిమాని రవితేజ తో చేసి ఆయనకి ఒక భారీ సక్సెస్ ని అందించేవాడు. ఏది ఏమైనా కూడా రవితేజ చేయాల్సిన సినిమాను పవన్ కళ్యాణ్ చేసి పది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక భారీ సక్సెస్ అందుకున్నాడనే చెప్పాలి… ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక బ్యాక్ టు బ్యాక్ అత్తారింటికి దారేది సినిమా కూడా మంచి విజయం సాధించాడం తో పవన్ కళ్యాణ్ మరోసారి స్టార్ హీరోగా వెలుగుందడమే కాకుండా నెంబర్ వన్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…

    ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలను తొందర్లోనే ఫినిష్ చేయాలని దానికి సంబంధించి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీదనే అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి… మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా రాణిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…