Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు తన అభిమానులు ఊగిపోతారు… ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లలో సందడి వాతావరణం ఉంటుంది. గత సంవత్సరం హరిహర వీరమల్లు, ఓజీ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు… 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి తన స్టామినాయేంటో చూపించాడు… ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక రీసెంట్ గా ఆయన సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుంది అంటూ గత నాలుగైదు సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నప్పటికి అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోసం 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా కోసం 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట… ఆయనతో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు.
కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే చాలా ఈజీగా సక్సెస్ ని సాధిస్తుంది. ఒకవేళ సినిమా తేడా కొట్టినా కూడా తన అభిమానులు ఆ సినిమాని రిపీటెడ్ గా చూసి భారీ కలెక్షన్స్ వచ్చే విధంగా ప్రోత్సహిస్తారనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ప్రతి ఒక్క దర్శకనిర్మాత ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతని స్టార్ డమ్ ను పెంచుతూ వచ్చాయి.
కానీ ఇకమీదట చేయబోతున్న సినిమాలు తన వాల్యూ ని పెంచే విధంగా ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ గా ఆయన ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఇష్టం వచ్చిన సినిమాలను చేస్తే కుదరదు. జనానికి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాలు ఉంటేనే ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా చేసినందుకు దానికి ఒక అర్థం ఉంటుంది…