Pushpa 2 collection : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద వైల్డ్ ఫైర్ గా చెలరేగుతూ, ఒక్కో రికార్డు ని లేపేస్తు ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వైల్డ్ ఫైర్ కి ఆజ్యం తోడైనట్టు, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తోడైంది. డిసెంబర్ 13 వ తేదీన ఆయన సంధ్య థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసిలాట ఘటనకు అరెస్ట్ అయ్యాడు. పక్క రోజు మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మరింత మారుమోగిపోయింది. ‘పుష్ప 2 ‘ వసూళ్లకు ఈ కాంట్రవర్సీ బాగా కలిసొచ్చింది. డిసెంబర్ 13 వ తారీఖు నుండి నిన్నటి వరకు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది.
ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ముందు రోజులతో పోలిస్తే 70 శాతం ఎక్కువ వసూళ్లు అన్నమాట. ఆయన అరెస్ట్ వ్యవహారం ఈ సినిమాకి ఎంత మేలు చేసిందో మీరే చూడండి. ముఖ్యంగా రెండవ ఆదివారం రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మన స్టార్ హీరోలకు మొదటి రోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ రావడమే పెద్ద ఘనత సాధించినట్టుగా అనుకుంటున్న రోజులివి. అలాంటిది ఈ సినిమాకి 11 వ రోజు వచ్చిందంటే, ఏ రేంజ్ సెన్సేషన్ అనేది మీరే అర్థం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఆదివారం అక్షరాలా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. సీడెడ్, నైజాం, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో రెండవ ఆదివారం ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు కూడా మెంటల్ ఎక్కిపోయింది.
మళ్ళీ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించే సినిమాని చూడగలమా భవిష్యత్తులో అనే రేంజ్ లో ఈ సినిమా దంచి కొట్టేస్తుంది. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. దంగల్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ తో ‘బాహుబలి 2 ‘ చిత్రం నిలిచింది. ఈ రెండు సినిమాల వసూళ్లను అధిగమించి ‘పుష్ప 2 ‘ 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తే మాత్రం అల్లు అర్జున్ పేరు చిరస్థాయిగా మన చరిత్రలో నిలిచిపోతుంది. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.