Bigg Boss Winner Sunny: రెండు తెలుగు రాష్ట్రాల్లో యాక్టర్ సన్నీ పేరు మారుమ్రోగుతుంది. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా సన్నీ అవతరించారు. 105 రోజుల బిగ్ బాస్ జర్నీ సక్సెస్ ఫుల్ గా ముగించాడు. టైటిల్ కోసం 18 మంది కంటెస్టెంట్స్ తో సన్నీ పోటీపడి టైటిల్ దక్కించుకున్నాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్ లో షణ్ముఖ్-సన్నీ తలపడగా… ప్రేక్షకులు సన్నీకి టైటిల్ కట్టబెట్టారు. సన్నీ విజయాన్ని ఆయన అభిమానులు, సన్నిహితులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బిగ్ బాస్ విన్నర్ గా యాభై లక్షల రూపాయల ప్రైమ్ మనీ సన్నీ సొంతం చేసుకున్నారు. మరి ఈ పూర్తి మొత్తం సన్నీకి ఇస్తారనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. పేరుకు సన్నీ యాభై లక్షలు గెలుచుకున్నా అతడికి దక్కేది కేవలం రూ. 34.40 లక్షలు మాత్రమే. అదేంటి మిగతా రూ. 15.60 లక్షలు ఏమయ్యాయి అనే సందేహం మీకు కలగవచ్చు. ఆ డబ్బు ప్రభుత్వానికి చెందుతుంది.
ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ఎవరైనా రూ. 10 వేలకు మించి ఎక్కువ మొత్తం ప్రైజ్ మనీగా గెలుచుకుంటే 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యాభై లక్షల రూపాయలలో చెల్లించాల్సిన పన్ను మొత్తం తగ్గించి, సన్నీకి నిర్వాహకులు ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్కన సన్నీకి ప్రైజ్ మనీగా 34.4 లక్షలు అందుతాయన్న మాట. అయితే సన్నీ గెలుచుకున్న ఫ్లాట్, బైక్ పై ఎటువంటి పన్నుల విధింపు ఉండదు.
అలాగే 15 వారాలకు గాను అతడికి వచ్చే రెమ్యూనరేషన్ లో కూడా ఎలాంటి తగ్గింపు ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ టాక్స్ రూపంలో చాలా తక్కువ మొత్తంలో తగ్గిస్తారు. సన్నీ నిర్వాహకులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 25 లక్షలకు పైనే తీసుకున్నారట. కాగా సువర్ణ భూమి వారు షాద్ నగర్ లో ఇచ్చిన 300 గజాల ఫ్లాట్ ధర.. రూ. 25 లక్షలుగా నాగార్జున తెలియజేశారు.
Also Read: Hamsa Nandini: క్యాన్సర్తో బాధపడుతున్న ప్రముఖ హీరోయన్.. ఎవరో తెలుసా?
కాబట్టి బిగ్ బాస్ విన్నర్ గా సన్నీ రూ. 80 లక్షల వరకు గెలుచుకున్నారు. ఇక సన్నీ నేపథ్యం గురించి చెప్పాలంటే ఆయన అసలు పేరు అరుణ్ రెడ్డి. సొంత ఊరు ఖమ్మంలో ఇంటర్ వరకు చదివారు. డిగ్రీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో పూర్తి చేశాడు. నటనపై మక్కువతో పరిశ్రమలో అడుగు పెట్టారు. యాంకర్ గా సన్నీ కెరీర్ మొదలైంది.
Also Read: Pushpa Day2 Collections: రెండో రోజుకే 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన ‘పుష్ప’రాజ్