Lucky Bhaskar : ‘సీతా రామం’ వసూళ్లను దాటేసిన ‘లక్కీ భాస్కర్’..100 కోట్లకు అతి చేరువలో..13 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ఈ వీకెండ్ తో ఈ చిత్రం 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. A సెంటర్స్ లో ఇంకా మంచి రన్ వచ్చే అవకాశం ఉండడంతో ఫుల్ రన్ లో మరో 20 కోట్లు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Written By: NARESH, Updated On : November 12, 2024 9:37 pm

Lucky Bhaskar

Follow us on

Lucky Bhaskar : హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సీతారామం’ చిత్రం టాలీవుడ్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అంత తేలికగా మరచిపోలేము. కేవలం కమర్షియల్ గా మాత్రమే కాకుండా, లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 98 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి దుల్కర్ కి మన తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ వసూళ్లను దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ దాటేసింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగా ఓపెనింగ్స్ వచ్చాయి, ఓపెనింగ్స్ తర్వాత ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రన్ ని ఈ సినిమా దక్కించుకుంది. కానీ అన్ని ప్రాంతాల్లో నూటికి నూరు శాతం బ్రేక్ ఈవెన్ మార్కుని మాత్రం అందుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 13 రోజులకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. నైజాం ప్రాంతంలో ఇప్పటి వరకు ఈ సినిమాకి 8 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో ఇక్కడ 10 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, కోస్తాంధ్ర ప్రాంతంలో 7 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను, 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళలో 17 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటకలో 5 కోట్ల రూపాయిలు, తమిళనాడులో 10 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 13 రోజులకు కలిపి 90 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 44 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. A సెంటర్స్ లో ఇంకా మంచి రన్ వచ్చే అవకాశం ఉండడంతో ఫుల్ రన్ లో మరో 20 కోట్లు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.