https://oktelugu.com/

ఎన్ని బాధలు.. ఎన్ని విఫల ప్రేమ కథలు.. అందుకే !

మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాకి తెలుగు ఇండస్ట్రీలో ఎందరో సన్నిహితులు ఉన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా వారి పనితో సంబంధం లేకుండా అందరితోనూ చక్కని అనుబంధాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది కాబట్టే.. మిల్క్ బ్యూటీకి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ఓ రేంజ్ గ్లామర్ తనలో ఏమి లేకపోయినా.. తనకు ఉన్న టాలెంట్ తోనే తమన్నా స్టార్ హీరోయిన్ గా ఇంకా కొనసాగ గలుగుతుంది. ఇక తమన్నా అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంది. అయితే పుస్తకం […]

Written By:
  • admin
  • , Updated On : December 15, 2020 / 05:57 PM IST
    Follow us on


    మిల్క్ బ్యూటీ త‌మ‌న్నాకి తెలుగు ఇండస్ట్రీలో ఎందరో సన్నిహితులు ఉన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా వారి పనితో సంబంధం లేకుండా అందరితోనూ చక్కని అనుబంధాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తుంది కాబట్టే.. మిల్క్ బ్యూటీకి ఇంకా అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ఓ రేంజ్ గ్లామర్ తనలో ఏమి లేకపోయినా.. తనకు ఉన్న టాలెంట్ తోనే తమన్నా స్టార్ హీరోయిన్ గా ఇంకా కొనసాగ గలుగుతుంది. ఇక తమన్నా అప్పుడప్పుడు కవితలు కూడా రాస్తుంది. అయితే పుస్తకం రూపంలో కూడా కవితలు రాస్తానంటుంది మిల్కీ బ్యూటీ.

    Also Read: బాలీవుడ్ స్టార్ పై కూతురు సంచలన వ్యాఖ్యలు !

    ఇంతకీ ఎందుకు ఇలా కవితలు రాస్తావ్ అంటే.. తన కవితల వెనక చాలా బాధ ఉందంటోంది ఈ సీనియర్ బ్యూటీ. సంతోషంగా ఉన్నప్పుడు అస్సలు కవితలు రాయదట.. కేవలం తనకు బాధ కలిగిన సమయంలోనే .. తన మనసు లోతుల్లో నుండి అనేక బావాలు వెల్లువలా వస్తాయని.. అప్పుడు మాత్రమే కవితలు రాస్తానని తెలిపింది తమన్నా. సహజంగా జీవితంలో లవ్ ఫెయిల్యూర్ అయినవాళ్లు.. లేదా స్వతహాగా మంచి రచయితలు మాత్రమే ఇలా కవితలు గట్ల రాస్తుంటారు.

    Also Read: నటి ఆత్మహత్య కేసులో నేరస్థుడు అతనే !

    మరి ఈ ముదురు భామకి ఏ విఫల ప్రేమ ఉందో గానీ.. తమన్నా నుండి కవితలు వరదలా వస్తాయట. ఇంతకీ తమన్నా కవయిత్రిగా మారడం వెనక ఎన్ని బాధలు ఉన్నాయో.. ఎన్ని విఫల ప్రేమ కథలు ఉన్నాయో ఆమెకే తెలియాలి. ఎంతైనా మిల్క్ బ్యూటీ అని ప్రేమగా పిలుచుకుంటారు త‌మ‌న్నాని. ప్రస్తుతం ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ తన అహా కోసం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాతో ప్ర‌త్యేకంగా ఓ టాక్ షోను ప్లాన్ చేశాడు. త్వరలోనే ఇది మొదలవ్వనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్