Ghattamaneni family: సినిమా ఇండస్ట్రీలో వారసులకు చాలా వా మంచి గుర్తింపైతే ఉంటుంది. మొదటి సినిమా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే ఆఫర్లు వస్తాయి. ఆ సినిమాతో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలుగా, హీరోయిన్లుగా వెలుగొందుతారు. లేకపోతే మాత్రం చాలా వరకు వెనకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడో మనందరికి తెలిసిందే. అతని తర్వాత తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీకి వచ్చినప్పటికి రమేష్ బాబు పెద్దగా సక్సెస్ ని సాధించలేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.కానీ మహేష్ బాబు మాత్రం వరుస సక్సెస్ లను సాధిస్తూ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఒక్కడే హీరోగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ తరంలో మాత్రం చాలా మంది హీరో హీరోయిన్లు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వెండి తెరకు పరిచయం అవ్వబోతున్నారు…కృష్ణ కూతురు మహేష్ బాబు వాళ్ళ అక్క ఆయన మంజుల ఒకప్పుడు నటిగా రెండు మూడు సినిమా చేసింది. ఇక ఇప్పుడు తన కూతురు జాన్వి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతోంది. ఇప్పటికే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలా హాట్ లుక్స్ తో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతోంది. ఇక ఈవిడ హీరోయిన్ గా ఏ మేరకు రాణిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…
రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సైతం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే ఆయన పలు కథలను కూడా వినే పనిలో బిజీగా ఉన్నాడు…
రమేష్ బాబు కూతురు భారతి సైతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటుంది. తను కూడా హీరోయిన్ గా పరిచయమై తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తోంది…
సుధీర్ బాబు కొడుకు అయిన చరిత్ హీరోగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చదువుకుంటున్నాడు. తన చదువు పూర్తయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
సుధీర్ బాబు మరో కొడుకు అయిన దర్శన్ సైతం తొందరలోనే మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…
ఇక మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ సైతం యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకుంటున్నాడు. తొందరలోనే తనను ఇండస్ట్రీకి తీసుకువచ్చి స్టార్ హీరోగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు…
ఇక మొత్తానికైతే ఈ తరంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి అర డజన్ మంది హీరోలు, హీరోయిన్స్ ఇండస్ట్రీకి రాబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక వీళ్లలో ఎవరు రాణిస్తారు? ఎవరు ఘట్టమనేని బాధ్యతలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది..
Half a dozen debutants are getting ready from the #MaheshBabu family
1. Jahnavi as Heroine (Manjula’s daughter)
2. Jaya Krishna (Ramesh Babu’s son)
3. Charith (Sudheer Babu’s son)
4. Darshan (Sudheer Babu’s son)
5. Bharati Ghattamaneni as Heroine (Ramesh Babu’s daughter)
6.… pic.twitter.com/vyYGLX5bdQ
— Daily Culture (@DailyCultureYT) October 29, 2025