Allu Arjun Atlee remuneration: ఒక్క సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆ తర్వాత నుంచి ఆ హీరోగాని, దర్శకుడు గానీ ఏది చెబితే అది జరుగుతుంటుంది. ప్రొడ్యూసర్లు సైతం వాళ్లతో సినిమాలు చేయడానికి బ్లాంక్ చెక్కులను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలోనే ప్రతి ఒక్క హీరో తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తన తోటి హీరోలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తున్నారు. మనం వాళ్ళతో పోటీ పడాలంటే ఎలాంటి సినిమాలను చేయాలి అనేది ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటాడు.
ఆయన ఒక సినిమా సక్సెస్ అయిన లేదంటే ఫ్లాప్ అయిన కూడా ఆ మూవీ సక్సెస్ కి కారణం ఏంటి? ప్లాప్ కి రీజనేంటి? ప్రేక్షకులు మన నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అభిరుచి మేరకు మనం ఇంకెలా కష్టపడాలి అనే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అందుకే అతనికి ‘పుష్ప 2’ సినిమాతో భారీ సక్సెస్ దక్కింది.
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు… ఇక మొత్తానికైతే ఈ సినిమా చాలా బాగా వస్తుందంటూ మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లీ దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా, అల్లు అర్జున్ 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్లిద్దరి రెమ్యూనరేషన్స్ కలిపి 350 కోట్లకు పైన అవుతుంది.
ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం వీళ్ళకి ఇచ్చే పారితోషికమతో 10 కోట్ల బడ్జెట్లో పూర్తయ్యే మూవీస్ ను 35 సినిమాల వరకు తీయొచ్చు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా అంతకు మించిన సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…