https://oktelugu.com/

Game Changer : 6 రోజుల ముందే దుబాయ్ లో ‘గేమ్ చేంజర్’ ప్రివ్యూ షో..టాక్ ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు!

అదే విధంగా గ్రామీణ నేపథ్యం లో వచ్చే పాట అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ రెండు పాటలు విన్న తర్వాత అంచనాలు ఇంకా కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2025 / 09:27 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ కర్ణాటక, కేరళ ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమా ని డబ్ చేయాలనీ విపరీతమైన డిమాండ్ రావడంతో కన్నడ, మలయాళం వెర్షన్స్ లో కూడా విడుదల చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ హైక్స్ జీవో కాసేపటి క్రితమే విడుదలైంది. బెనిఫిట్ షోస్ కి 600 రూపాయిలు పెట్టుకోవచ్చని, అదే విధంగా సింగల్ స్క్రీన్స్ కి ఉన్న టికెట్ రేట్స్ కి అదనంగా 145 రూపాయిలు, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కి ఉన్న రేట్స్ మీద 175 రూపాయిలు పెంచుకోవచ్చని అనుమతులు ఇస్తూ జీవో ని జారీ చేసారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజు ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ ని నేడు దుబాయి లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో మెయిన్ హైలైట్స్ ఏమిటంటే రామ్ చరణ్ నటన. డైరెక్టర్ శంకర్ టేకింగ్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ లో రామ్ చరణ్ తన విశ్వరూపం చూపించాడట. ఇది వరకు మనం ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా వచ్చింది అంటూ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దుబాయి షో నుండి కూడా అదే రేంజ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎంతో అద్భుతంగా ఉందని, రామ్ చరణ్ మరియు ఎస్ జె సూర్య మధ్య సన్నివేశాలు థియేటర్స్ రూఫ్స్ దద్దరిల్లిపోయేలా చేస్తుందని అంటున్నారు.

    ఓవరాల్ గా చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ పొలిటికల్ ఎంటర్టైనర్ ని వింటేజ్ శంకర్ మార్క్ లో ఉంటే చూడాలని కోరుకునే అభిమానులకు ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుందని చెప్తున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ చిత్రం ఉంటుందా లేదా అనేది మరో ఆరు రోజుల్లో తెలియనుంది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ఇంకా రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. రేపు విడుదల చేయబోయే juke బాక్స్ లో ఈ పాట ఉంటుందని సంగీత దర్శకుడు తమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు. ది సౌల్ ఆఫ్ గేమ్ చేంజర్ పాట, అదే విధంగా గ్రామీణ నేపథ్యం లో వచ్చే పాట అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ రెండు పాటలు విన్న తర్వాత అంచనాలు ఇంకా కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి.