https://oktelugu.com/

Dookudu Brahmanandam: దూకుడు సినిమాలోకి బ్రాహ్మనందం క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే..?

ఇక ఈ సినిమాలో మొదటగా బ్రహ్మానందం క్యారెక్టర్ లేదంట అయితే శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే రాసుకున్న టైంలో స్టోరీని మార్చేసి బ్రహ్మానందం క్యారెక్టర్ ని ఎంటర్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 20, 2023 / 04:40 PM IST

    Dookudu Brahmanandam

    Follow us on

    Dookudu Brahmanandam: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ లో బ్రహ్మ నందం టాప్ లెవల్లో ఉండే నటుడు అనే చెప్పాలి. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఇక ఇండస్ట్రీలో ఆయన చాలా మంచి సినిమాలు చేస్తూ మంచి నటుడు గా గుర్తింపును పొందారు. కొన్ని సినిమాలయితే ఆయన వల్లే విజయం సాధించాయి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తనకు తన బాడీ సహకరించకపోవడంతో సినిమాలకి కొంచెం విశ్రాంతి ఇచ్చినప్పటికీ రీసెంట్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో కీలకమైన పాత్ర పోషించి ఇంకో మెట్టు పైకెక్కారనే చెప్పాలి ఇక ఇప్పటివరకు వెయ్యికి పైన సినిమాలు చేసిన బ్రహ్మానందం నటుడిగా తన స్థాయి ఏంటో నిరూపించుకున్నారు. 1000 పైన సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పేరు సంపాదించుకున్నారు…మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ఇండస్ట్రీకి కొట్టిందంటే దానికి కారణం బ్రహ్మానందం గారనే చెప్పాలి.ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ లో మహేష్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం బ్రహ్మానందం మీదనే నడుస్తుంది. దానివల్లే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

    ఇక ఈ సినిమాలో మొదటగా బ్రహ్మానందం క్యారెక్టర్ లేదంట అయితే శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే రాసుకున్న టైంలో స్టోరీని మార్చేసి బ్రహ్మానందం క్యారెక్టర్ ని ఎంటర్ చేశారు.ఆలా ఈ సినిమాలోకి బ్రహ్మానందం క్యారెక్టర్ వచ్చింది.ఈ క్యారెక్టర్ లేకపోతే పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి నేనే బ్రహ్మానందం క్యారెక్టర్ ని యాడ్ చేశాను అని శ్రీనువైట్ల ఒక సందర్భం లో చెప్పాడు. ప్రస్తుతం బ్రహ్మానందం ఫుల్ ల్లెంత్ క్యారెక్టర్లు కాకుండా చిన్న చిన్న గెస్ట్ అప్పీరియన్సు లు లాంటివి చేస్తూ ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలు బహుశా మారె నటుడు కూడా చేసి ఉండడు. అన్ని సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఇక బ్రహ్మానందం గురించి చిరంజీవి లాంటి ఒక గొప్ప హీరో మాట్లాడుతూ బ్రహ్మానందం లాంటి నటుడు ఇండియాలో లేడు అని ఆయన గురించి గొప్పగా చెప్పడం జరిగింది…