https://oktelugu.com/

Indian 2 : శంకర్ ఇండియన్ 2 లో చనిపోయిన ఆ ముగ్గురి నటులతో ఎలా నటింపజేశాడో తెలుసా..?

ఇక ఇదిలా ఉంటే శంకర్ రీసెంట్ గా 'భారతీయుడు 2' అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ శంకర్ డైరెక్షన్ మాత్రం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : July 15, 2024 9:51 am
    How did Shankar act with the three dead actors in Indian 2?

    How did Shankar act with the three dead actors in Indian 2?

    Follow us on

    Indian 2 : ఒక దర్శకుడి దగ్గర టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించిన దర్శకులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఒకప్పుడు కె.వి.రెడ్డి లాంటి దర్శకులు ఎలాంటి గ్రాఫిక్స్ కు సంబంధించిన టెక్నాలజీ లేని సమయంలో కూడా చాలా మ్యాజిక్ లు ,మాయలు కల్గించే సినిమాలను చేసి సక్సెస్ లను కూడా అందుకున్నారు. అలాగే ఆశ్చర్య పరిచేలా విజువల్స్ ఉండే విధంగా సినిమాను తీర్చిదిద్ది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.

    మరలాంటి దర్శకులు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారనే చెప్పాలి. ఇక తెలుగులో అయితే రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకొని తన దైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే పాన్ ఇండియాలో కూడా తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న శంకర్ లాంటి దర్శకుడు కూడా ఇదే కోవకే చెందుతాడు… ఇక ఇదిలా ఉంటే శంకర్ రీసెంట్ గా ‘భారతీయుడు 2’ అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ శంకర్ డైరెక్షన్ మాత్రం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక మేకింగ్ లో శంకర్ ని కొట్టే దర్శకుడు మరొకరు లేరు అనేది ఎప్పటినుంచో తెలుస్తున్న విషయమే..అలాంటిది ఈ సినిమాలో కూడా మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే వివేక్, మనోబాల, వేణు అనే ముగ్గురు నటులు చనిపోయినప్పటికీ వాళ్లని స్క్రీన్ మీద ఎలా చూపించాడు. వాళ్ల చేత ఎలా నటింపజేశాడు అనేది ఇప్పుడు చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ బతికే ఉన్నారు. సినిమా స్టార్ట్ అయి కొంత పార్ట్ పూర్తయిన తర్వాత వీళ్లలో ఒక్కొక్కరు చనిపోయారు. మొత్తానికైతే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతానికి భూమ్మీద లేరు. అయినప్పటికీ వీళ్ళ క్యారెక్టర్లతో షూట్ చేశాడు కాబట్టి దాన్ని ఫుల్ గా కంటిన్యూ చేయడానికి శంకర్ సరికొత్త టెక్నాలజీని వాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఏఐ టెక్నాలజీ ద్వారా ఆ క్యారెక్టర్స్ ను రీ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ టెక్నాలజీని వాడడంలో శంకర్ సిద్ధహస్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అందుకే తను ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఏఐ టెక్నాలజీ సహాయంతో ఈ చిత్రాన్ని పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే శంకర్ మరోసారి విజువల్ గా తన సత్తా చాటుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ ఏఐ తో వాళ్ళ క్యారెక్టర్స్ ని రీ క్రియేట్ చేయడానికి ప్రొడ్యూసర్ కి దాదాపు 12 కోట్ల వరకు ఖర్చు అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక శంకర్ సినిమా అంటేనే డబ్బులు మంచినీళ్లలా ఖర్చవుతుంటాయి. ఇక ప్రొడ్యూసర్స్ ఎవరైనా కూడా శంకర్ సినిమాని భరించాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన విజువల్స్ కి లిమిట్ అనేది ఉండదు.

    ఆయన ఎలాంటి విజువల్స్ కోరుకుంటాడో అలాంటి విజువల్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు దానివల్లే ఆయన సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ధైర్యం చేసి ముందుకు వస్తుంటారు. ఆయన సినిమాల్లో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ ఆ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అంతకు అంతా వసూలు చేస్తాయని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు…