https://oktelugu.com/

AR Rahman-Sye Raa Bhanu : అసలు ఎవరీ సైరా భాను.. ఏఆర్ రెహమాన్ తో ప్రేమ, పెళ్లి ఎలా జరిగింది? వారి కథేంటంటే?

AR రెహమాన్ సైరా బానుని 12 మార్చి 1995న వివాహం చేసుకున్నారు. రెహమాన్‌కి వధువులను చూసే సమయం లేకపోవడంతో తల్లిదండ్రులు వివాహ సెటప్‌ని ఏర్పాటు చేశారు. నటుడు రషీన్ రెహమాన్‌కి కోడలు అయిన సైరా గుజరాతీ కుటుంబం నుంచి వచ్చింది. ఉత్తర భారతదేశ సంస్కృతిపై బాగా ప్రావీణ్యం సంపాదించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 20, 2024 / 01:04 PM IST

    AR Rahman-Sye Raa Bhanu

    Follow us on

    AR Rahman-Sye Raa Bhanu : సంగీత మాస్ట్రో AR రెహమాన్ సైరా బాను 29 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు ప్రకటించారు. వీరి విడాకుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రెహమాన్ అభిమానులను కూడా బాధ పెడుతుంది వీరి విడాకుల ప్రకటన. సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ జంట. ఈ స్వరకర్త తన ట్వీట్‌లో ‘ఈ విషయాన్ని తెలపడంతో వీరి విడాకులు నిజమే అని తేలింది.

    వారిని ఎప్పుడూ సంతోషకరమైన జంటగా చూసే కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. AR రెహమాన్ సైరా బానుని 12 మార్చి 1995న వివాహం చేసుకున్నారు. రెహమాన్‌కి వధువులను చూసే సమయం లేకపోవడంతో తల్లిదండ్రులు వివాహ సెటప్‌ని ఏర్పాటు చేశారు. నటుడు రషీన్ రెహమాన్‌కి కోడలు అయిన సైరా గుజరాతీ కుటుంబం నుంచి వచ్చింది. ఉత్తర భారతదేశ సంస్కృతిపై బాగా ప్రావీణ్యం సంపాదించింది.

    సైరా బాను మరియు ఏఆర్ రెహమాన్ మొదటిసారి కలుసుకున్నప్పుడు
    గతంలోని ఓ ఇంటర్వ్యూలో AR రెహమాన్ తన తల్లి, సోదరి మొదటిసారిగా చెన్నైలోని సూఫీ సన్యాసి మోతీ బాబా మందిరంలో సైరాను ఎలా చూశారో పంచుకున్నారు. “తన తల్లికి సైరా గురించి, ఆమె కుటుంబం గురించి తెలియదట. కానీ వారు మందిరానికి కేవలం ఐదు ఇళ్ళ దూరంలో నివసించారు కాబట్టి, వారు వెళ్లి ఆమెతో మాట్లాడారట. ఇదంతా కూడా చాలా సహజంగా జరిగింది” అంటూ గతంలో వెల్లడించారు రెహమాన్.

    సైరాతో తన మొదటి సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ రెహమాన్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆమెను మొదటిసారి చూసినప్పుడు చాలా నచ్చిందట. అందంగా, సౌమ్యంగా ఉందని తెలిపారు. జనవరి 6, 1995న మొదటిసారి కలుసుకున్నారట. అదే రెహమాన్ 28వ పుట్టినరోజట. ఆ తర్వాత ఎక్కువగా ఫోన్‌లో కమ్యూనికేట్ అయ్యారట. సైరా కుచ్చి, ఇంగ్లీషు మాట్లాడుతుందట. అందుకే తనను పెళ్లి చేసుకోవాలా అని ఇంగ్లీషులో అడిగారట రెహమాన్. ఆ ప్రశ్న విని సైలెంట్ గా ఉందట సైరా.

    గుజరాత్‌లోని కచ్‌లో డిసెంబర్ 20, 1973లో జన్మించిన సైరా బాను, సాంస్కృతికంగా సంపన్నమైన కుటుంబానికి చెందినది. సంప్రదాయం, విలువలతో ముడిపడిన కుటుంబంలో జన్మించడంతో తన జీవితంపై ఆమె దృక్పథాన్ని బాగా ప్రభావితం చేసిందని అన్నారు రెహమాన్. సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేదట.

    భారతదేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసుల్లో ఒకరిని వివాహం చేసుకున్నప్పటికీ, సైరా ఎక్కువగా తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తెలిపేవారు కాదట. తనే కాదు ఈ జంట తమ కుటుంబం గురించిన వివరాలను చాలా అరుదుగా బహిర్గతం చేస్తారు. వారి పని, విజయాలపై దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతుంటారు. పెద్ద పెద్ద సమావేశాలు, బాలీవుడ్ పార్టీలకు కలిసి వెళ్తారు. ఈ జంట అంబానీ వివాహానికి కూడా హాజరయ్యారు. సైరా తన సంగీత పర్యటనలలో రెహమాన్‌కు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. కేవలం తోడుగా కాకుండా, సైరా అతని సృజనాత్మక ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొనేది.