Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు అనే వాడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మనం సినిమాలను ఎలా చేయాలి. అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడే దర్శకుడు ఒక మంచి డైరెక్టర్ గా ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీ లో కొనసాగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతం అదే చేస్తున్నాడు. ఆయన ఒకప్పుడు మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే వరుసగా భారీ సక్సెస్ లను కూడా అందుకున్నాడు. ఇక ఆ తర్వాత అలాంటి సినిమాలే చేస్తే రొటీన్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో ప్రేక్షకుల అభిరుచి మేరకు ఆయన గ్రాఫిక్స్ వైపు మొగ్గు చూపిస్తూ మగధీర, ఈగ, బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. తనకు గ్రాఫిక్స్ మీద ఏ మాత్రం నాలెడ్జ్ లేకపోయిన కూడా తన అబ్జర్వేషన్ గానీ, గ్రాఫిక్స్ డిజైనర్లతో ఆయన డిస్కస్ చేసిన విధానం వల్ల గాని ఆయన చాలావరకు నేర్చుకున్నారు. దాంతోనే ఆయన సినిమాలో గ్రాఫిక్స్ చేసిన కూడా అది గ్రాఫిక్స్ అని మనకు అంత పెద్దగా తెలియదు.
ఒక బెస్ట్ అవుట్ ఫుట్ ని తీసుకురావడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మిగతా సినిమాల్లో గ్రాఫిక్స్ అనేది చేసినప్పటికీ అది ఈజీగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సిజీ వర్క్ కంటే న్యాచురల్ గా ఉండే వర్క్ ని రాజమౌళి ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గ్రాఫిక్స్ మీద చాలా గ్రిప్ సంపాదించిన తర్వాతే అలాంటి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వచ్చాడు.
కానీ మిగతా దర్శకులు మాత్రం గ్రాఫిక్స్ మీద ఏ మాత్రం అవగాహన లేకపోయినా గ్రాఫిక్ డిజైనర్లను నమ్ముకొని సినిమాలను చేస్తూ బొక్క బోర్లా పడుతున్నారు. ఒక విషయం మీద పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దానికి సంబంధించిన పనులు చేస్తే బాగుంటుంది అనేది రాజమౌళి బాగా నమ్ముతూ ఉంటాడు.
అందువల్లే మిగతా దర్శకుల వల్ల సాధ్యం కానీ విషయాలు ఆయన ఒక్కడి వల్లే అవుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు కూడా ఆయన మహేష్ బాబు తో ఒక భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకొని తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…