https://oktelugu.com/

ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడో.. అది గొప్పే !

ఒక్క బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ వచ్చింది. ఇది ఇప్పటివరకూ ఏ సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. అలాంటిది ప్రభాస్ ఒక్క సినిమాతోనే సాధించాడు. పైగా బాహుబలి తరువాత సాహో మూవీతో కూడా ఇండియా మొత్తం అలరించి పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు ప్రభాస్. వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 11:17 AM IST
    Follow us on


    ఒక్క బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ వచ్చింది. ఇది ఇప్పటివరకూ ఏ సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. అలాంటిది ప్రభాస్ ఒక్క సినిమాతోనే సాధించాడు. పైగా బాహుబలి తరువాత సాహో మూవీతో కూడా ఇండియా మొత్తం అలరించి పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు ప్రభాస్. వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమాని పూర్తి చేశాడు.

    Also Read: ఉప్పెన మూవీలో అది ఇండస్ట్రీని షేక్ చేస్తుందట..

    కాగా ప్రస్తుతం ‘ఆది పురుష్’, ‘సలార్ ‘ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే నెలలో 15 రోజులు ‘సలార్’కు, 15 రోజులు ‘ఆదిపురుష్’కు కేటాయించేలా షెడ్యూల్ వేసుకున్నాడట ప్రభాస్. ‘సలార్’ చిత్రీకరణ ఎక్కువగా తెలంగాణలోనే జరగనుంది. ‘ఆదిపురుష్’ అంతా ముంబయిలోనే ప్లాన్ చేశారు. ఒకేసారి రెండు సినిమాల్లో చేస్తూ లుక్ పరంగా వైవిధ్యం చూపించడం కొంచెం కష్టమే. మరి ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. పైగా రెండు సినిమాలు పూర్తిగా డిఫరెంట్ జోనర్లు.

    Also Read: తాగి బరువెక్కానా?.. చనిపోవాలనుకున్నా.. హీరోయిన్ హాట్ కామెంట్స్

    ఇక ప్రభాస్ ‘సలార్’లో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను తీసుకోబోతున్నారు. ఈ మేరకు ఈ స్టార్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా, త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారట. ఇక ప్రభాస్ ఆది పురుష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా మన తెలుగు హీరో ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయటం మన తెలుగు వారందరికీ గర్వకారణం. పైగా మన హీరోకి విలన్స్ గా బాలీవుడ్ స్టార్స్ చేయడం గొప్ప విషయమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్