Nayanthara Vignesh Twin Boys: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు నెలల క్రితం తన ప్రియుడు విఘ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఈ దంపతులిద్దరూ తల్లితండ్రులు అయ్యామంటూ నిన్న సోషల్ మీడియా లో వేసిన ఒక ట్వీట్ సెన్సషనల్ గా మారింది..ఇద్దరు కావాలా పిల్లలకు జన్మనిచిన్న ఈ దంపతులకు అభిమానులు మరియు శ్రేయోభిలాషుల నుండి కృతజ్ఞతలు వెల్లువ కురుస్తుండగా మరో పక్క పెళ్ళైన నాలుగు నెలల్లోనే పిల్లలు ఎలా కలిగారంటూ ఆరాలు తియ్యడం ప్రారంభించారు..నయనతార విగ్నేష్ తో డేటింగ్ లో ఉన్నప్పుడే గర్భవతి అయ్యిందా..అలా అయితే నయనతార గర్భం దాల్చినట్టు ఎక్కడా కూడా దాఖలాలు కనిపించలేదు అంటూ అనుమానాలు పడడం పడడం ప్రారంభించారు అభిమానులు..ఇటీవల కాలం లో నయనతార అనేక సార్లు మీడియా ముందుకి వచ్చింది..లెక్క ప్రకారం ఆమె నిజంగా ఇప్పుడు ఇద్దరు పిల్లలలకు జన్మనిచ్చి ఉంటె, ఆమె సతీష్ తో పెళ్లి చేసుకునే సమయం లో 5 వె నెల గర్భం దాల్చి ఉండాలి..కానీ అలాంటి దాఖలాలు ఏమి లేవు.

అయితే ఈ విషయం పై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది..పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లల్ని ఎలా కన్నారో ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలంటూ నయనతార దంపతులకు ఉత్తర్వులు జారీ చేసింది..ఇక అసలు విషయానికి వస్తే గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు సరోగసి ద్వారా సంతానం ని పొందొచ్చు..సరోగసి అంటే వేరే తల్లి గర్భం లో పురుష వీర్యం పంపించి సంతానం ని పొందడం..నయనతార దంపతులు ఈ విధంగా సంతానం ని పొందారా..లేదా దత్తత తీసుకున్నారా అని ప్రభుత్వం వివరణ కోరింది..దీనికి నయనతార దంపతులు ఏమని సమాధానం చెప్తారో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఏకంగా ప్రభుత్వమే వివరణ కోరడం తో ఇక ఈ విషయాన్నీ గోప్యంగా ఉంచే అవకాశం కోల్పోయారు..చూడాలి మరి ఈ సెన్సిటివ్ విషయం లో నయనతార మరియు ఆమె భర్త ఎలా స్పందిస్తారో అనేది..ఇక నయనతార పెళ్ళైన తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఆమె నటించిన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.