Nandamuri Kalyan Ram: నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకుగా కల్యాణ్ రామ్ సినిమాల్లో రాణిస్తున్నాడు. అతనొక్కడే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే విజయం అందుకున్నాడు. తనదైన శైలిలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే బ్రహ్మాండమైన హిట్ సాధించాడు. తరువాత కల్యాణ్ రామ్ హరేరామ్ తీసినా అది పెద్దగా హిట్ సాధించలేదు. తమ్ముడు ఎన్టీఆర్ తో జైలవకుశ తీసి మరో విజయం దక్కించుకున్నాడు.

సినిమాల ఎంపికలో వైవిధ్యాన్ని చూస్తాడు. అందరిలా కాకుండా ప్రత్యేకమైన శైలిలో సినిమాలు తెరకెక్కించడం ఆయన నైజం. పూరీ జగన్నాథ్ తో ఇజం తీసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం బింబిసార సినిమా తీస్తున్నాడు. బింబిసారుడు మగధ రాజ్యాన్ని పాలించిన రాజుగా గుర్తింపు పొందిన కథ కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. చారిత్రక చిత్రం కావడంతో ఈ సినిమాపై రామ్ ప్రత్యేక చొరవ చూపుతున్నాడు. పాత్రలు ఎంపిక చేసుకోవడంలో కూడా కల్యాణ్ రామ్ ది డిఫరెంట్ స్టైల్ అని తెలుస్తోంది.
ఇక బింబిసార సినిమా కోసం కల్యాణ్ రామ్ చాలా కష్టపడుతున్నాడు. ఇదివరకు బొర్ర వేసుకుని ఉన్న కల్యాణ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా శ్రమపడ్డాడు. జిమ్ కు వెళుతూ డైట్ పాటిస్తూ అనేక రకాలుగా శ్రమించి చివరకు ఆరుపలకల దేహం తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ఇది ప్రత్యేక ఆకర్షణ కానుండటంతో కల్యాణ్ రామ్ శ్రమకు తగిన ఫలితం దొరుకుందో లేదో వేచి చూడాల్సిందే. మొత్తానికి ఓ చారిత్రక చిత్రంగా బింబిసార రికార్డులు తిరగరాస్తుందో ఏమో తెలియదు.

ఆగస్టు 5న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడి ఆరుపలకల దేహం రావాలంటే మామూలు కసరత్తులు కాదు దానికి చాలా శ్రమ కావాలి. అందుకు అంగీకరించే కల్యాణ్ రామ్ కఠోర శ్రమ చేసి కష్టపడి ఈ దేహాన్ని సాధించినందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కూడా ఇదే విధంగా బ్రహ్మాండమైన హిట్ సాధించి కల్యాణ్ రామ్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నారు.