Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఇండస్ట్రీ లో కెరియర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఆయన పడని కష్టం లేదు. ఇప్పుడు ఆయన సాధించని విక్టరీ లేదు. దాదాపు 40 సంవత్సరాలపాటు ఇండస్ట్రీని ఏకచిత్రాధిపత్యంతో ఎలాడం అంటే మామూలు విషయం కాదు.
ఇక ఇదిలా ఉంటే చిరంజీవి కూడా వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం ‘ విశ్వంభర ‘అనే సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే చిరంజీవి ఒకప్పుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్, అన్నయ్య అనే సినిమాలు చేశాడు. అయితే ఇదే చనువుతో చిరంజీవితో మరో సినిమా చేయాలని కూడా ముత్యాల సుబ్బయ్య భావించాడు. ఇక అందులో భాగంగానే బాలయ్య బాబు చేసిన కృష్ణ బాబు సినిమా స్టోరీని మొదటగా చిరంజీవికి వినిపించాడట.
ఆ సినిమా స్టోరీ చిరంజీవికి పెద్దగా నచ్చలేదట. దాంతో కథ నచ్చలేదని చిరంజీవి చెప్పారట. అయిన కూడా ముత్యాల సుబ్బయ్య వినిపించుకోకుండా కథను నీకు అనుకూలంగా చేంజ్ చేస్తాను సినిమా చేద్దామని చెప్పాడట. అయిన కూడా ఎందుకో చిరంజీవి ఆ కథ చేయకూడదు అని మనసులో స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాడట. ఇక ఒక పక్క ముత్యాల సుబ్బయ్య ఎంత కన్వీన్స్ చేసిన కూడా చిరంజీవి ఆ సినిమాని చేసే ఉద్దేశ్యం తనకి లేదని కరకండిగా చెప్పేశాడట. ఏదైనా మంచి కథ ఉంటే తీసుకురండి చేద్దాం అని చెప్పాడట.
అలాగే ప్రస్తుతానికి అయితే నేను ఈ సినిమా చేయలేనని చెప్పడంతో ముత్యాల సుబ్బయ్య అదే స్టోరీ ని బాలయ్య దగ్గరికి తీసుకు వచ్చి కృష్ణ బాబు అనే పేరుతో ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా కి భారీ నష్టాలు వచ్చాయి. ఇక అదే కాకుండా బాలయ్య బాబు కెరియర్ లోనే ఒక భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక మొత్తానికైతే చిరంజీవి ఆ సినిమా ఫ్లాప్ నుంచి తప్పించుకుంటే బాలయ్య బాబు మాత్రం బుక్ అయ్యాడనే చెప్పాలి…