https://oktelugu.com/

Tollywood : వెంకటేష్ కోసం రాసుకున్న స్టోరీ లోకి బాలయ్య ఎలా వచ్చాడు…

బాలయ్య, వెంకటేష్ ఇద్దరు కూడా చాలా సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నారు...అప్పటికి ఇప్పటికి వీళ్ళ ఇమేజ్ భారీ రేంజ్ లో పెరిగిందే తప్ప తగ్గలేదు...

Written By:
  • Gopi
  • , Updated On : July 29, 2024 / 12:15 PM IST
    Follow us on

    Tollywood  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇక ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు అలా సినిమాలను మిస్ చేసుకొని స్టార్ డమ్ పొందడంలో వెనుకబడిపోయారు. ఇక మరికొందరు మాత్రం వేరే హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలను చేసి మంచి విజయాలనందుకొని స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వన్నీ సహజమని మరి కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కథలను సరిగ్గా జడ్జ్ చేయలేక సినిమాలని వదులుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే విక్టరీ వెంకటేష్ చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాని బాలయ్య బాబు చేసి భారీ సక్సెస్ ని అందుకున్న విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి బాలయ్య బాబు బి. గోపాల్ డైరెక్షన్ లో చేసిన ‘సమరసింహారెడ్డి ‘ సినిమాని మొదట వెంకటేష్ చేయాల్సిందట. ఇక వెంకటేష్ అంతకు ముందే జయంత్ సి పరంజి డైరెక్షన్ లో ‘ప్రేమించుకుందాం రా ‘ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని చాలా చక్కగా చూపించారు. ఇక ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్ రాసుకున్న ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయిన సమరసింహారెడ్డి సినిమాని కూడా వెంకటేష్ తో చేద్దామా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. కానీ చివరి నిమిషంలో బి గోపాల్ బాలయ్య బాబుకి కథ చెప్పడం ఆయన ఒప్పుకోవడంతో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు.

    ఇక మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ సినిమా షూటింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలయ్య బాబు చాలా దగ్గరుండి మరి ఈ సినిమా యూనిట్ మొత్తాన్ని ముందుండి నడిపించారట. ఇక దాని ఫలితమే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలకృష్ణ ఇమేజ్ ని తారాస్థాయికి తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఇక ఒకానొక టైమ్ లో బాలయ్య బాబు ఇండస్ట్రీ హిట్టు కొట్టడమే కాకుండా చిరంజీవి లాంటి స్టార్ హీరో కి సైతం పోటీని ఇస్తూ ఈ సినిమాతో చిరంజీవి పక్కన నిలిచాడు.

    ఇక మొత్తానికైతే బాలయ్య బాబు లాంటి నటుడికి రౌద్రం ప్రదర్శించడం కొత్తేమీ కాదు. ఆ డైలాగులు గాని, ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్లు గాని ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు బి. గోపాల్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. బాలకృష్ణ ఇమేజ్ ను మ్యాచ్ చేస్తూ ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ ను చెడగొట్టకుండ తను చాలా వరకు సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అందులో అతను సక్సెస్ కూడా అయ్యాడు…

    ఇక మొత్తానికైతే వెంకటేష్ ఈ సినిమాని చేస్తే ఎలా ఉండేదో తెలీదుగానీ, బాలయ్య బాబు ఈ సినిమాని చేయడం వల్ల ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టుగా కూడా నిలవడం గొప్ప విషయమనే చెప్పాలి… ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమా చూసే ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అందువల్లే ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ సీన్లని ఎప్పటికీ మర్చిపోలేడు…