https://oktelugu.com/

Allu Arjun National Award: జాతీయ ఉత్తమ నటుడిగా మన పుష్పరాజ్ ఎలా ఎదిగారు? అంత నటన ఎలా సాధ్యమైంది?

అల్లు రామలింగయ్య మనవడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ.. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెనక ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ తన స్వయంకృషితోనే ఆయన ఎంత ఎదిగాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 24, 2023 / 07:09 PM IST

    Allu Arjun National Award

    Follow us on

    Allu Arjun National Award: తెలుగు సినీ హీరోలెవ్వరికీ దక్కని అరుదైన అదృష్టం మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వరించింది. తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు. కానీ ఆ విజయాన్ని మన బన్నీ అందుకున్నాడు. నేషనల్ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు హీరో మన పుష్ప రాజ్ అయ్యారు . తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కి ఈ గౌరవం దక్కింది.

    అయితే అల్లు అర్జున్ కి ఈ అరుదైన గౌరవం ఒక రాత్రిలో రాలేదు. ఎన్నో సంవత్సరాల కృషి ఈరోజు ఈ అవార్డు రూపంలో వచ్చింది.

    చిన్నప్పుడే ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మామ చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రంలో బాలనటుడిగా మెరిసాడు అల్లు అర్జున్. అటు స్వాతిముత్యంలో కూడా నటించాడు ఈ ఐకాన్ స్టార్. తర్వాత చిరంజీవి యాక్ట్ చేసిన ‘డాడీ’ చిత్రంతో చిన్నరోల్ లో కనిపించి మురిపించాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా చేసిన తొలి చిత్రం గంగోత్రి. కానీ ఆ సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరోనా అని ఎంతోమంది విమర్శలు చేశారు. ఆ మాటలకు బన్నీ నిరుత్సాహపరలేదు. బంతి నేల కేసి కొడితే రెట్టింపు ఎదుగుతుంది అన్నట్టు, ఆ తరువాత ఆర్య సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ చేసిన ప్రతి సినిమాలో ఆయన నటన పరంగా వందకి వంద మార్కులు సంపాదించారు. అసలు ఈయన హీరోనా అన్న దగ్గర నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనిపించుకున్నారు అల్లు అర్జున్.

    అల్లు రామలింగయ్య మనవడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ.. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెనక ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ తన స్వయంకృషితోనే ఆయన ఎంత ఎదిగాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
    మొదటి సినిమా గంగోత్రి తరువాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు.

    ఇక డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు అల్లు అర్జున్ అంటే సౌత్ ఇండియా ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ పుష్పా సినిమాతో అంతర్జాతీయంగా ఆయన టాలెంట్ తెలిసింది. ఆంధ్రప్రదేశ్, కేరళాలోనే వీరాభిమానులు ఉన్న ఈ హీరోకి అంతర్జాతీయంగా అన్ని భాషల వారు పుష్పా సినిమాతో ఈయనకి ఫాన్స్ అయిపోయారు.

    పుష్ప రాజ్‌గా దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‎లో బిజీ అయ్యాడు. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం పుష్ప పార్ట్‌-2 కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ అవార్డు సంపాదించి మన తెలుగువారి సత్తాని దేశవ్యాప్తంగా చాటి చెప్పాడు అల్లు అర్జున్. మొత్తానికి గంగోత్రి టైంలో ఆయన్ని తిట్టిన నోరులే ఇప్పుడు పొగిడేలా చేసుకున్నారు ఈ హీరో.