https://oktelugu.com/

National Film Awards 2023: బ్రేకింగ్ న్యూస్… ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు!

2021 డిసెంబర్ లో పుష్ప చిత్రం విడుదలైంది. ఇది పీరియాడిక్ క్రైమ్ డ్రామా. పుష్పరాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2023 / 06:42 PM IST

    National Film Awards 2023

    Follow us on

    National Film Awards 2023: తెలుగు సినిమా చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. హీరో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 69వ నేషనల్ అవార్డ్స్ భారత ప్రభుత్వం నేడు ప్రకటించింది. ఉత్తమ నటుడు కేటగిరీకి గట్టి ఏర్పడింది. పుష్ప లోని నటనకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ప్రకటన రాగానే అల్లు అర్జున్ అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

    2021 డిసెంబర్ లో పుష్ప చిత్రం విడుదలైంది. ఇది పీరియాడిక్ క్రైమ్ డ్రామా. పుష్పరాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు. పుష్ప ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో ఊహించని విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యాయి.

    మొత్తంగా పుష్ప రూ. 360 కోట్ల వసూళ్ల వరకూ రాబట్టింది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేర్చింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా… రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక రోల్స్ చేశారు. దేవిశ్రీ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

    కూలీగా స్మగ్లర్ గా అల్లు అర్జున్ పాత్రలో జీవించాడు. ఆయన యాటిట్యూడ్, మేనరిజం ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ కి పుష్ప జాతీయ అవార్డు తేవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. నేడు అది నిజమైంది. కమర్షియల్ చిత్రాలు చేసే స్టార్ హీరోలకు నేషనల్ అవార్డు రావడం చాలా కష్టం. ముఖ్యంగా ఆర్ట్ చిత్రాల్లో నటించిన నటులకు ఇవి దక్కుతాయి. అల్లు అర్జున్ ఆ ట్రెండ్ బ్రేక్ చేశాడు. టాలీవుడ్ లో నేడు పండగ వాతావరణం నెలకొంది.