Sandeep Reddy Vanga: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది…అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ఆయన ‘అనిమల్’ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. రన్బీర్ కపూర్ ఎంటైర్ కెరియర్ లోనే భారీ హిట్టు కొట్టిన సినిమాగా ఈ మూవీ నిలవడం విశేషం…ఈ మూవీ 800 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి బాలీవుడ్ ను షేక్ చేసింది. ప్రస్తుతం స్పిరిట్ సినిమా కోసం ఆయన విపరీతమైన కసరత్తులైతే చేస్తున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి పోతున్న క్రమంలో కేవలం ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన మూవీ షట్ కి అవసరమైన సెట్స్ వేయించాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేశాడు. కాబట్టి తను అనుకున్నట్టుగానే 6 నెలల్లో సినిమాను ఈజీ గా పూర్తి చేసేస్తాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ – ఆర్జీవీ కాంబోలో రావాల్సిన మూవీ మిస్ అవ్వడానికి కారణం ఎవరు..?
సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికి అది సిచువేషన్ కి తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి వల్గర్ గా అనిపించదు. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. తద్వారా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో తను కూడా ఒకడు కావడం విశేషం…
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన దర్శకులందరు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పోటీ ఇవ్వాలని చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ మాత్రం బాలీవుడ్ మాఫియాని సైతం షేక్ చేశాడు. వాళ్ళందరు మూకుమ్మడిగా వచ్చి సందీప్ సినిమాల మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చి విష ప్రచారం చేసినా కూడా తన సినిమాలో దమ్ము ఉంది కాబట్టి నా సినిమాలు ఆడుతాయని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…
ఇక రీసెంట్ గా ‘స్పిరిట్’ సినిమా విషయంలో దీపిక పదుకొనే ని తీసేసినప్పుడు ఆమె సందీప్ మీద చేసిన కామెంట్ల కి తను ఇచ్చిన రిప్లై నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. తను ఎక్కడ తగ్గకుండా సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఇప్పుడు చేస్తున్న స్పిరిట్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తోంది. అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…