Bigg boss 7 telugu
BiggBossTelugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఊపందుకుంటుంది. గత సీజన్స్ ఫెయిల్యూర్స్ మదిలో పెట్టుకుని మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. హౌస్ వీడిన మొదటి కంటెస్టెంట్ ఆమె అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. నేటి ఎపిసోడ్లో ఎవరు నామినేట్ అయ్యారనేది తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 9 మంది నామినేషన్స్ లో ఉన్నారట. శివాజీ, అమర్ దీప్, రతికా రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, తేజాతో పాటు మరికొందరు ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు తెలుస్తుంది.
కంటెస్టెంట్ దామిని ఎవరూ నామినేట్ చేయలేదు. కాబట్టి ఆమె ఈవారం నామినేషన్స్ నుండి తప్పుకుంది. ఇక పవర్ అస్త్ర పొందిన ఆట సందీప్ 5 వారాలు ఇమ్యూనిటీ పొందాడు. కాబట్టి అతన్ని నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇక మరో పవర్ అస్త్ర గెలుచుకునేందుకు రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ దీనికోసం రంగం సిద్ధం చేశాడు. ఇంటి సభ్యులను రెండుగా విభజించాడు. ఒక టీమ్లో అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక సింగ్, శివాజీ, షకీలా ఉన్నారు. టీమ్ కి రణధీర అని పేరు పెట్టారు.
మరొక టీమ్లో తేజా, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, దామిని ఉన్నారు. ఈ టీమ్ పేరు మహాబలి. ఆట సందీప్ సంచాలకుడు. ఇంట్లో మాయాస్త్ర ఉంది. ఆ అస్త్రాన్ని పొందాలంటే రణధీర-మహాబలి టీమ్స్ ఒకరితో మరొకరు పోటీపడాలి. టాస్క్స్ లో గెలిచిన టీమ్ కి మాయాస్త్ర దక్కుతుంది. మాయాస్త్ర గెలిచిన టీమ్ సభ్యుల్లో ఒకరు పవర్ అస్త్ర గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక మాయాస్త్ర గెలుచుకునేందుకు రెండు టీమ్స్ గట్టిగా పోటీపడ్డాయి.
పవర్ అస్త్ర గెలుచుకున్న కంటెస్టెంట్ కి కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. ఆల్రెడీ మొదటి పవర్ అస్త్ర అందుకున్న సందీప్ కి 5 వారాలు ఇమ్యూనిటీ దక్కింది. ఈ ఐదు వారాలు అతడు నామినేషన్స్ లో ఉండడు. అలాగే vip రూమ్ కూడా పొందాడు. సెకండ్ పవర్ అస్త్ర గెలుచుకున్న ఇంటి సభ్యుడు కూడా ఇదే ప్రయోజనాలు వర్తిస్తాయి. మొత్తంగా నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది.