Home Loan EMI Trick: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. అయితే ఈ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ఇల్లు నిర్మించుకోవాలని కోరిక ఉన్నా కూడా సరైన ఆదాయం ఉండదు. ఇలాంటి సమయంలో బ్యాంకు రుణం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటారు. మిగతా వాటికంటే గృహ రుణం వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది హోమ్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుంటారు. అయితే కొందరు ఈ మొత్తం పై ఏర్పడిన వడ్డీని చెల్లించడానికి అవస్థలు పడుతూ ఉంటారు. కానీ కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. చిన్న ట్రిక్ ద్వారా హోమ్ లోన్ తక్కువ వడ్డీని చెల్లించి పూర్తి చేసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏదో ఇప్పుడు చూద్దాం..
చాలామంది గృహ రుణం తీసుకోగానే నెలనెలా ఈఎంఐ చెల్లిస్తూ వెళుతుంటారు. ఇలా నిర్ణయించిన ఈఎంఐ ద్వారా హోమ్ లోన్ పూర్తికావడానికి సంవత్సరాలు పడుతుంది. అయితే అనుకున్న తేదీ కంటే ముందే గృహ రుణం పూర్తి కావడంతో పాటు తక్కువ వడ్డీ చెల్లించే అవకాశం ఉంది. అదెలా అంటే..? ప్రతినెల ఉదాహరణకు రూ.10,000 ఈఎంఐ ఉందనుకోండి. దీనిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. అంటే రూ.11,000 లేదా అంతకుమించి పెంచుకోవడం వల్ల అనుకున్న తేదీ కంటే ముందే హోమ్ లోన్ పూర్తయ్య అవకాశముంటుంది. అంతేకాకుండా తక్కువ కాలంలో హోమ్ లోన్ పూర్తి చేస్తే వడ్డీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా నిర్ణయించిన ఒకే ఈఎంఐ ద్వారా కాకుండా ప్రతి ఏటా ఈఎంఐ ని పెంచుకుంటూ పోవాలి. అయితే ఇలా పెంచడం ద్వారా రోజువారి అవసరాలపై భారం పడకుండా చూసుకోవాలి. అంటే ఇలా పెంచాల్సి వచ్చినప్పుడు అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉండాలి. ఉదాహరణకు ఉద్యోగులు తమ జీతం పెరిగినట్లయితే ఆ పెరిగిన దానిని ఈఎంఐ కి డైవర్ట్ చేయాలి. వ్యాపారులు అదనపు ఆదాయాన్ని ఇటువైపు మళ్ళించుకోవాలి.
మరోవైపు ఇలాంటి చెల్లింపులు చేసే ముందు బ్యాంకు వారితో సంప్రదింపులు చేయాలి. ఎందుకంటే కేవలం ఈఎంఐ పెంచుకోవడం మాత్రమే కాకుండా.. వ్యాపారులు తమకు అదనపు ఆదాయం వచ్చినట్లయితే దానిద్వారా కూడా చెల్లింపులు చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రిన్సిపల్ మొత్తం తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా మిగిలిన మొత్తానికి వడ్డీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా హోమ్ లోన్ భారాన్ని తగ్గించుకోవడం వల్ల దాదాపు రూ. 50 లక్షల హోం లోన్ పైన రూ. 20 లక్షల వడ్డీ సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏడాదిలో కేవలం 12 ఇఎంఐ లు మాత్రమే కాకుండా 13 ఈఎంఐలు చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.
