The Fall Guy: గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించుకున్న హాలీవుడ్ మూవీ…పాపం హీరోకి మాత్రం చెడు అనుభవం..

'కెనాన్ రోల్స్ ' అనే స్టంట్ టెక్నిక్ ను ఎక్కువగా ఉపయోగించినందుకు గిన్నిస్ బుక్ లో ఈ సినిమా చోటు సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ర్యాన్ గ్లోస్టింగ్ ఇప్పటివరకు మూడుసార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యాడు.

Written By: Gopi, Updated On : May 23, 2024 9:49 am

The Fall Guy

Follow us on

The Fall Guy: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. ఇక అందులో ముఖ్యంగా కొన్ని సినిమాలైతే తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చాలా అవార్డులను కూడా సొంతం చేసుకుంటాయి. ఇక రీసెంట్ గా హాలీవుడ్ స్టార్ హీరో అయిన ‘ర్యాన్ గోస్లింగ్’ హీరోగా నటించిన ‘ది ఫాల్ గాయ్’ అనే సినిమా రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయి కేవలం రెండు వారాల్లోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన బార్బీ సినిమా ఎలాంటి విజయం అయితే అందుకుందో ఈ సినిమా అంతకుమించి సక్సెస్ ని సాధించడమే కాకుండా చాలా అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది. ఇక అలాగే విమర్శకుల నుంచి కూడా చాలా ప్రశంసలైతే అందుకుంటుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి చాలా హైలైట్ గా నిలిచాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడకుండా ఉండలేరు. ఇక ఈ సినిమాకి ‘డేవిడ్ లీచ్’ దర్శకత్వం వహించాడు. ఇక 1980 వ సంవత్సరంలో ఫేమస్ అయిన ది ఫాల్ గాయ్ అనే సిరీస్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తీసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘కెనాన్ రోల్స్ ‘ అనే స్టంట్ టెక్నిక్ ను ఎక్కువగా ఉపయోగించినందుకు గిన్నిస్ బుక్ లో ఈ సినిమా చోటు సంపాదించుకుంది. ఇక ఇదిలా ఉంటే ర్యాన్ గ్లోస్టింగ్ ఇప్పటివరకు మూడుసార్లు ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయ్యాడు. కానీ ఆ మూడుసార్లలో ఒక్కసారి కూడా ఆయనకు ఆస్కార్ అవార్డు అయితే రాలేదు…