The Boys Season 4 Review: ‘ద బాయ్స్ సీజన్ 4’ సిరీస్ రివ్యూ…

హోమ్ లాండర్ యొక్క హెయిర్ గ్రే కలర్ లోకి మారిపోతూ ఉంటుంది. అంటే ఆయన ఏజ్ పెరిగిపోతుంది.ఇక ఆయన చనిపోయే లోపు తన కొడుకును ట్రైన్ చేసి తనకి తన సామ్రాజ్యం మొత్తాన్ని అప్పగించాలని అనుకుంటాడు.

Written By: Gopi, Updated On : June 14, 2024 8:58 am

The Boys Season 4 Review

Follow us on

The Boys Season 4 Review: హాలీవుడ్ సినిమాల గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. గ్రాఫిక్స్ తో వండర్స్ చేయడం లో అయిన, స్క్రీన్ మీద విజువల్స్ ను చూపించడం లో అయిన, వాళ్లకు వాళ్లే సాటి అనేలా ఉంటాయి వాళ్ల సినిమాలు. ఇక వాళ్ళు చేసిన సినిమాలు మనవాళ్ళను మెప్పించడమే కాకుండా ఇక్కడి ప్రేక్షకుల చేత విజిల్స్ కూడా వేయిస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ‘ది బాయ్స్ సీజన్ 4’ వెబ్ సిరీస్ నుంచి మూడు ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి… అయితే అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…

కథ

హోమ్ లాండర్ యొక్క హెయిర్ గ్రే కలర్ లోకి మారిపోతూ ఉంటుంది. అంటే ఆయన ఏజ్ పెరిగిపోతుంది.ఇక ఆయన చనిపోయే లోపు తన కొడుకును ట్రైన్ చేసి తనకి తన సామ్రాజ్యం మొత్తాన్ని అప్పగించాలని అనుకుంటాడు. ఇక ఇదే సమయం లో బుల్లి బుట్చర్ తన బాయ్స్ తో కలిసి పనిచేయడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి అనుకుంటాడు…అయితే హోమ్ లాండర్ కి బిల్లి బుట్చర్ కి మధ్య ఎలాంటి గొడవలు రాబోతున్నాయి..? అనేది తెలియాలంటే మిగితా ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

విశ్లేషణ

ఇక గత మూడు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ మూడు ఎపిసోడ్లు కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగానే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ మూడు ఎపిసోడ్స్ లో యాక్షన్ సీక్వెన్స్ గాని, డ్రామా ఎలివేషన్స్ గాని ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతాయి…ఇక ఈ మూడు ఎపిసోడ్లను బట్టి చూస్తుంటే హోమ్ లాండర్ ఏజ్ అయిపోవడానికి వచ్చింది. కాబట్టి ఈ సిరీస్ ని కూడా ఈ సీజన్ తో గాని లేదా వచ్చే సీజన్ తో గాని ముగించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సిరీస్ దర్శకుడు అయిన ‘ఎరిక్ క్రిపికి’ మొదటి మూడు సీజన్లు ఎలాంటి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో యాక్షన్ సీక్వెన్స్ ని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడో ఇక ఇప్పుడు ఈ సీజన్ ను కూడా ఏ మాత్రం బోర్ కొట్టించకుండా వచ్చిన మూడు ఎపిసోడ్లను ముందుకు తీసుకెళ్ళాడు.

ఇక అందులో ప్రేక్షకుడి తాలూకు ఇంటెన్సీని అర్థం చేసుకొని రాబోయే ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసే విధంగా ఒక క్యూరియాసిటిని బిల్డ్ చేస్తూ ఈ ఎపిసోడ్స్ అయితే సాగాయి. ఇక మొత్తం 8 ఎపిసోడ్స్ కి గాను ఇప్పుడు కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ మూడు ఎపిసోడ్స్ తో కూడా ఇంతకుముందు ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించగలిగారో అంతకుమించి ఇంపాక్ట్ ఇప్పుడు క్రియేట్ చేశారు. ఒక దర్శకుడి యొక్క ఆలోచన ధోరణి ఊహల్లో ఉన్నప్పటికీ క్యారెక్టర్ల తాలూకు ఇంపార్టెన్స్ అయితే ఎక్కడ తగ్గకుండా తీసుకెళ్లాడు.

ఇక ఇప్పటి వరకైతే రాజకీయాలకి వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ తీసుకెళ్ళారు. ఇక కథ మొత్తం మిగిలిన ఎపిసోడ్స్ లోనే ఉండడం వల్ల ఈ ఎపిసోడ్స్ ను క్యారెక్టర్ బిల్డప్ కోసం వాడుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక మిగిలిన ఎపిసోడ్స్ వస్తే గాని ఈ సీజన్ సూపర్ హిట్ అయిందా లేదంటే మిగతా వాటి కంటే తగ్గిందా అనేది మనకు ఫుల్ క్లారిటీగా తెలుస్తుంది. మరి మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయి అనేది తెలియాల్సి ఉంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక రిలీజ్ అయిన మూడు ఎపిసోడ్స్ లో కూడా ఆర్టిస్టులు బాగా చేశారు. ముఖ్యంగా హోమ్ లాండర్ క్యారెక్టర్ లో నటించిన నటుడు ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సిరీస్ ఎలక్షన్స్ సీజన్స్ ని బేస్ చేసుకుని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ప్రతి సీన్ లో కూడా రాజకీయానికి సంభందించిన ఛాయలు కనబడుతూ ఉంటాయి..ఇక హాలీవుడ్ సినిమాల్లో టెక్నికల్ అంశాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. నార్మల్ సీన్ ను కూడా వాళ్ళు టెక్నికల్ వే లో ఆలోచించి సూపర్ గా పొట్రే చేసి సక్సెస్ అవుతూ ఉంటారు…ఇక ఈ సీజన్ విషయం లో కూడా అలానే చేశారు…

ప్లస్ పాయింట్స్

యాక్షన్ ఎపిసోడ్స్
విజువల్స్

మైనస్ పాయింట్స్

కొన్ని క్యారెక్టర్స్ ను బిల్డ్ చేసిన విధానం అంత బాగా లేదు..

రేటింగ్
ఇక ఇప్పటివరకు వచ్చిన 3 ఎపిసోడ్స్ మేము ఇచ్చే రేటింగ్ 2.75/5