In Time: టైమ్ వాల్యూ తెలిపే ఒకే ఒక హలీవుడ్ సినిమా ఏంటో తెలుసా..?

ధనవంతుల దగ్గర నుంచి టైమ్ ని దొంగలించి పేదలను పంచి వాళ్ళను బతికించాలనే ఉద్దేశ్యం లో తను ఉంటాడు. ఇక తన ఐడియాలజీ నచ్చిన అమ్మాయి కూడా తనతో పాటే ఉంటూ దొంగతనాలు చేస్తూ టైమ్ ను సంపాదిస్తూ పేదలకు పంచుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : May 22, 2024 8:52 am

In Time

Follow us on

In Time: డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలంటే అది హాలీవుడ్ వాళ్లకే సొంతమవుతుందని ఇప్పటికే వాళ్ళు చాలాసార్లు ప్రూవ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే టైమ్ వాల్యూ తెలియజేస్తూ హాలీవుడ్ లో ఒక సినిమా వచ్చి పెను సంచలనాన్ని సృష్టించింది. నిజానికి మనలో ఎవరు కూడా టైం సెన్స్ ను ఫాలో అవ్వరు. ఎంత ముఖ్యమైన పని ఉన్న కూడా దాన్ని రేపు, ఎల్లుండి చేద్దాం అంటూ లైట్ తీసుకుంటూ ఉంటారు.

అయితే టైం అనేది ఎంత ముఖ్యమో మనకు తెలియాలి అంటే ‘ఇన్ టైమ్ ‘ అనే సినిమా చూడాలి. అయితే ఈ సినిమా స్టోరీ 2169 లో జరుగుతుంది. ఇక అప్పుడు అందరు డిజిటల్ క్లాక్ తో పుడతారు. ఇక వాళ్ల టైమ్ అనేది పాతికేళ్ల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇక ఆ మీదట బతకాలి అంటే కష్టపడి టైమ్ ను కొనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఏం చేసిన కూడా టైమ్ నే మనీ లాగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది…ఇక ఇదిలా ఉంటే మురికివాడలో ఉండే విల్ అనే కుర్రాడు ఒక్క సెకండ్ లేట్ అవ్వడంతో తన తల్లిని కోల్పోతాడు. ఇక దాంతో సొసైటీ మీద కోపంతో ఆయన ధనవంతులను టార్గెట్ చేస్తాడు. ఇక అందులో భాగంగానే విస్ అనే ధనవంతుడి ఇంటికి వెళ్లి తన కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు.

దాని ద్వారా ధనవంతుల దగ్గర నుంచి టైమ్ ని దొంగలించి పేదలను పంచి వాళ్ళను బతికించాలనే ఉద్దేశ్యం లో తను ఉంటాడు. ఇక తన ఐడియాలజీ నచ్చిన అమ్మాయి కూడా తనతో పాటే ఉంటూ దొంగతనాలు చేస్తూ టైమ్ ను సంపాదిస్తూ పేదలకు పంచుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ధనవంతులు యొక్క టైం అనేది తగ్గుతుంది. పేదవాళ్ల యొక్క టైం పెరుగుతుంది దీని ద్వారా పేదవాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశ్యంతోనే విల్ ఇలాంటి పనిచేస్తూ ఉంటాడు. ఇక నిజానికి ఈ సినిమాని కనక మనం చూసినట్లైతే ప్రతి సెకండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటమే కాకుండా మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అయితే ఈ సినిమా 2011 వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని కనక చూడని వారు ఎవరైనా ఉంటే కచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ సినిమా అనేది టీమ్ వాల్యూమ్ చెప్పడమే కాకుండా మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకైతే తీసుకెళ్తుంది…ఇక ఇలాంటి కాన్సెప్ట్ తో మన తెలుగులో అయితే ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఇకమీదట ఏమైనా వస్తాయేమో చూడాలి…