spot_img
Homeఎంటర్టైన్మెంట్Tom Cruise: హాలీవుడ్ లో ఫస్ట్ టైం.. టామ్ క్రూజ్ ను డైరెక్ట్ చేస్తున్న తెలుగు...

Tom Cruise: హాలీవుడ్ లో ఫస్ట్ టైం.. టామ్ క్రూజ్ ను డైరెక్ట్ చేస్తున్న తెలుగు తేజం…ఇది మామూలు వండర్ కాదు…

Tom Cruise: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు వచ్చిన కూడా అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించి భారీ పాపులారిటిని సంపాదించుకుంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం హాలీవుడ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే వాళ్లు ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్లో ఎలాంటి పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టామ్ క్రూజ్ లాంటి నటుడుకి ప్రపంచ స్థాయి ఆదరణ లభిస్తుంది. అతనితో సినిమాలు చేయడానికి ఇతర దేశాల దర్శకులు సైతం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి దగ్గరైన ‘టామ్ క్రూజ్’ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘డూపెల్ గంగార్’ అనే స్పై థ్రిల్లర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి అనీష్ చాగంటి అనే తెలుగు మూలాలు ఉన్న ఒక యువ డైరెక్టర్ దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలైతే ఉన్నాయి. 2018 వ సంవత్సరంలో ‘సెర్చింగ్’ అనే ఒక సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.

అందుకే ఇప్పుడు టామ్ క్రూజ్ ను సైతం డైరెక్షన్ చేసే స్థాయికి తను ఎదిగాడు. ఇక ఏది ఏమైనా కూడా హాలీవుడ్ లో దిగ్గజ హీరో అయిన టామ్ క్రూజ్ ను డైరెక్ట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ప్రస్తుతం మన తెలుగు సినిమాలు సైతం ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో తెర్కెక్కుతున్నాయి. అయినప్పటికి ఒక తెలుగు దర్శకుడు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతుండడం అనేది నిజంగా గొప్ప విషయం దానికి తెలుగు వాళ్ళమైన మనమందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి…

ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెసులు సాధించినా కూడా హాలీవుడ్ డైరెక్టర్లు సాధించిన విజయాలు అంత ఇంతా కాదనే చెప్పాలి… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు హాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలనేది ఒక డ్రీమ్ గా పెట్టుకొని ఉంటారు. ఇక ఈ విషయంలో అనీష్ చాగంటి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version