Rajamouli Mahesh Babu Movie Glimpses: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో – దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు రాజమౌళి లాంటి దర్శకుడు చేసిన చాలా సినిమాలు తనకి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. వరుసగా 12 విజయాలను దక్కించుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు… ఇప్పటి వరకు సినిమా షూటింగ్ శర వేగంగా పూర్తి చేస్తున్నారు…ఇక సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ నవంబర్ నుంచి ప్రేక్షకుల ముందు ఉంచుతానని రాజమౌళి గతంలో చెప్పిన మాటలు అభిమానుల్లో కొంతవరకు ఆనందాన్ని కలిగింపజేశాయి. ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు రాజమౌళి ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ అయితే రెడీ చేశారట.
ప్రస్తుతం ఈ గ్లింప్స్ ను హాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ కి చూపించాడట…ఆయన నుంచి చాలా మంచి ప్రశంసలు దక్కాయని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగానే ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ ను రివిల్ చేయాలని చూస్తున్నారు. ఇక నవంబర్లో తను ఇండియాకి వస్తున్నాడు.
కాబట్టి అదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడు. అవతార్ 3 సినిమా విషయంలో జేమ్స్ కామెరూన్ సినిమాకి రాజమౌళి సైతం ఇండియాలో ప్రమోషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఒకరికొకరు వాళ్ళ సినిమాలను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక హాలీవుడ్ మేకర్స్ అయిన జేమ్స్ కామెరూన్ కి ఈ మూవీ గ్లింప్స్ నచ్చింది అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… జక్కన్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ కూడా సూపర్ సక్సెస్ ని సాధించి అక్కడి డైరెక్టర్స్ తో పోటీపడే అవకాశాలైతే ఉన్నాయి…