Hollywood Beauty: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వం లో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) లు హీరోలుగా తెరకెక్కిన దృశ్య కావ్యం త్రిబుల్ ఆర్(RRR). ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ సినిమా గురించిన విశేషాలు ఏదో ఒక రకంగా రోజుకు ఒకసారి మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తెలుగు వాళ్లమైనా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అది మన సినిమా మన అందరి సినిమా కాబట్టి, అందులో నటించింది మన హీరోలే కాబట్టి వాళ్లకు మనం అభిమానులంగా మారిపోయాం..
అందువల్ల మనం వాళ్ల గురించి మాట్లాడడంలో తప్పులేదు కానీ త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఇండియాలో కంటే హాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక మొత్తానికైతే త్రిబుల్ ఆర్ సినిమా సాధించిన విజయం తెలుగు వాళ్ళ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందనేది వాస్తవం… ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి హాలీవుడ్ బ్యూటీ అయిన “అన్నే హాత్వే “(Anne Hathaway) మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ సినిమా లో నటించిన నటీనటుల్లో ఎవరో ఒకరితో అయినా తనకు నటించాలని ఉందని త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన వాళ్లందరూ చాలా మంచి నటులని ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని తెలియజేసింది.
Also Read: Star Actor: హత్యకు గురైన స్టార్ నటుడు.. ఇంతకీ ఎవరు చంపారు?
ఇక ఈ ముద్దుగుమ్మ ఇంటర్ స్టెల్లర్, ద డార్క్ నైట్ రైజేస్ ఈ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఎప్పుడు “దా ఐడియా ఆఫ్ యు “అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.
Also Read: Anasuya Sen Gupta : కేన్స్ ఫెస్టివల్ లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి… ఎవరీ అనసూయ?
అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆమె త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను చెబుతూ ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లో ఎవరో ఒకరితో నటించాలానే విషయాన్ని బయట పెట్టింది. అది వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…