Homeఎంటర్టైన్మెంట్Hit 3 : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Hit 3 : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Hit 3 : దర్శకుడు శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హిట్ 3 తెరకెక్కింది. హిట్ చిత్రంలో విశ్వక్ సేన్ నటించగా, హిట్ 2లో అడివి శేష్ హీరోగా చేశాడు. హిట్ సిరీస్ ని నాని స్వయంగా నిర్మిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ఈ చిత్రాలు రూపొందాయి. హిట్ 3 మే 1న థియేటర్స్ లోకి వచ్చింది. నాని ఏసీపీ అర్జున్ సర్కార్ రోల్ చేశాడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న హిట్ 3, థియేటర్స్ లో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో హిట్ 3కి ఆదరణ దక్కింది.

Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?

హిట్ 3 థియేటర్స్ లోకి వచ్చి 11 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు హిట్ 3 సినిమా వసూళ్లు పరిశీలిస్తే సూపర్ హిట్ అని చెప్పాలి. నైజాంలో రూ. 16.2 కోట్ల షేర్ అందుకుంది. సీడెడ్ లో రూ.4.4 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆంధ్ర రూ.14.15 కోట్లు, యూఎస్ రూ. 9.5 కోట్లు షేర్ వసూలు చేసింది. మొత్తంగా హిట్ 3 పదకొండు రోజులకు గాను రూ.53 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టినట్లు సమాచారం. హిట్ 3 థియేట్రికల్ రైట్స్ రూ. 47 కోట్లు. బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో పడ్డ హిట్ 3 సూపర్ హిట్ అని చెప్పాలి.

నాని కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. దసరా నాని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. నానికి జంటగా శ్రీనిధి శెట్టి నటించింది. నిర్మాతగా నాని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆయన నిర్మించిన కోర్ట్ చిత్రం సైతం ఇటీవల విడుదలై లాభాలు తెచ్చిపెట్టింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రం రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. ప్రస్తుతం నాని ది పారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. దసరా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ది పారడైజ్ టీజర్ విడుదల కాగా, అంచనాలు పెంచేసింది. నాని లుక్ గూస్ బంప్స్ లేపేదిగా ఉంది. ది పారడైజ్ మూవీతో నానిలోని మరో కోణం సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు హిట్ 4కి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. హిట్ 3 చిత్రంలో కార్తీ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో హిట్ 4 హీరో కార్తీ అనే ప్రచారం మొదలైంది.

Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?

RELATED ARTICLES

Most Popular