Hit 3 Movie Teaser
Hit 3 Movie Teaser: ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural star Nani) హీరో గా నటించిన చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit: The 3rd Case). ఈ చిత్రానికి ముందు విడుదలైన రెండు సినిమాలకు నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన నాని, ఈ సినిమాలో హీరో గా కూడా నటించాడు. అర్జున్ సర్కార్ గా అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాని నటించాడు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ క్లైమాక్స్ లో చిన్న గెస్ట్ ద్వారా ‘అర్జున్ సర్కార్’ క్యారక్టర్ లో కనిపించిన నాని, ఆ పాత్రకు కొనసాగింపుగా ఈ చిత్రం చేసాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. గతంలో కూడా నాని మాస్ రోల్స్ చేసాడు కానీ, ఈ రేంజ్ మాస్ రోల్ లో చూడడం మాత్రం ఈ సినిమాతోనే మొట్టమొదటిసారి అనొచ్చు.
టీజర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు నరుకుడే నరకుడు. అసలు ఇతను నిజంగా పోలీసా?, లేకపోతే క్రిమినల్ నా? అనేది టీజర్ చూస్తున్నంతసేపు అర్థం అవ్వని పరిస్థితి. హీరోయిన్ కూడా టీజర్ లో అదే డైలాగ్ కొడుతుంది. అందుకు నాని ‘నన్ను పోలీస్ అనుకునే మోసపోయారు జనాలు ఇన్నేళ్లు..మీకు చూపిస్తా నా ఒరిజినల్’ అంటూ డైలాగ్ కొడుతాడు. టీజర్ చివర్లో కత్తి పొట్టలో దూర్చి, తల వరకు లాగి విలన్ ని అడ్డంగా చీల్చిన షాట్ ని చూస్తే చాలా క్రూరంగా అనిపించక తప్పదు. ఇంత క్రూరమైన హింస అవసరమా?,ఎక్కడైనా పోలీస్ గన్ తో కాకుండా కత్తి తో మర్డర్లు చేయడం చూశామా?, హీరో క్యారక్టర్ కి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఎలా పడితే అలా సినిమాలు తీస్తారా? అంటూ సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా ఈ చిత్రం పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ సినిమాల్లో బ్లడ్ బాత్ ని యూత్ ఆడియన్స్ బాగా ఇష్టపడుతారు కాబట్టి, సినిమాటిక్ లిబర్టీ కోసం అలా చేసినట్టు అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో హిట్ 1, హిట్ 2 లలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్(Vishwak Sen), అడవి శేష్(Adavi sesh) వంటి వారు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్ వచ్చింది కానీ, కేవలం అడవి శేష్ మాత్రమే నటిస్తాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ సిరీస్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. డైరెక్టర్ శైలేష్ కొలను గత చిత్రం ‘సైంధవ్’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ సినిమాలో కూడా ఇంతే, హద్దులు దాటినా వయొలెన్స్ ని ఆడియన్స్ అంగీకరించలేకపోయారు. కనీసం ఈ సినిమాలో అయినా ఆడియన్స్ ఆ బ్లడ్ బాత్ ని అంగీకరిస్తారో లేదో చూడాలి. మే 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.