Hit 3 Movie OTT Release : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘హిట్ 3′(Hit : The Third Case) మూవీ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 118 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చాయి. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలాఖరు వరకు థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక రెంటల్ బేసిస్ మీద ఈ చిత్రం నడిచే అవకాశం లేకపోవడం తో కమీషన్ బేసిస్ మీద నడిచే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో మరో కోటి నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా రావొచ్చు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : హరి హర వీరమల్లు’ టికెట్ రేట్స్ ఆ రేంజ్ లో ఉంటాయా..? సామాన్యులు చూసినట్టే ఇక!
గతం లో ఇదే సంస్థ నాని హీరోగా నటించిన ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలను కొనుగోలు చేసింది. ఈ మూడు చిత్రాలకు నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘హాయ్ నాన్న’ చిత్రం అయితే ఏకంగా 10 వారాల పాటు ట్రెండ్ అయ్యింది. అలా నాని కారణంగా నెట్ ఫ్లిక్స్ సంస్థకు భారీ లాభాలు రావడంతో ‘హిట్ 3’ చిత్రాన్ని 55 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కొంతమంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ బిజినెస్ ఈమధ్య కాలంలో జరగలేదు. అయితే ఈ చిత్రాన్ని వచ్చే నెల 5వ తారీఖున తెలుగు తో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే చేసింది మూవీ టీం. థియేటర్స్ లో ఈ చిత్రానికి పబ్లిక్ టాక్ కాస్త డివైడ్ గానే వచ్చింది.
మరి ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నాని కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా వాళ్ళ జోన్ లో లేకపోయినా కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది. ఒకవేళ చూసిన తర్వాత వాళ్ళ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. వయొలెంట్ సన్నివేశాలను చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు. వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చవచ్చు. ఇక నాని తదుపరి సినిమా ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే ఇది కూడా కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరంగా ఉంచే సినిమాలాగానే అనిపిస్తుంది. గ్లింప్స్ వీడియో లోని బూతు మాటని మగవాళ్ళు పలకడం కూడా చాలా కష్టం. అలాంటిది ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. వచ్చే ఏడాది మార్చి 26 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.