Balayya & Pawan Kalyan: వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు కనీస ఆదరణ పొందకపోతే.. మేకర్స్ కి కష్టాలు, నష్టాలు తప్పవు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన చిత్రాలు బోల్తా పడితే హీరోలు కూడా ఉసూరు మంటారు. హరి హర వీరమల్లు ఫలితం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సినిమాతో పవన్ కి ఎదురైన ఓ అనుభవం గతంలో బాలయ్యకు కూడా ఎదురైంది.
Also Read : కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది…రజినీ కాంత్, నాగార్జున లు హైలెట్ కాబోతున్నారా..?
హరి హర వీరమల్లు(HARI HARA VEERMALLU) కోసం పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) చాలా కష్టపడ్డారు. ఒకపక్క రాజకీయ వ్యవహారాలు నెరవేరుస్తూనే… ఈ సినిమా పూర్తి చేశారు. హరి హర వీరమల్లు కొరకు ఆయన స్టంట్ మాస్టర్, డైరెక్టర్ బాధ్యతలు కూడా మారారు. ప్రేక్షకుల నుండి విశేష స్పందన పొందిన కుస్తీ ఫైట్ ని పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేశారు. అలాగే హరి హర వీరమల్లు చిత్రంలోని కొంత భాగాన్ని డైరెక్ట్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఆయన కష్టం వృధా అయ్యింది. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తో నడిచిన హరి హర వీరమల్లు డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.
ప్రీమియర్స్ తో పాటు ఓపెనింగ్ డే సత్తా చాటిన హరి హర వీరమల్లు వసూళ్లు రెండో రోజు 70% శాతానికి పైగా పడిపోయాయి. శని, ఆదివారాల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయ్యింది. అయితే అది సరిపోదు. ఊహించినట్లే సోమవారం హరి హర వీరమల్లు వసూళ్లు మరింతగా పడిపోయాయి . 5వ రోజు ఈ చిత్రం వసూళ్లు రూ2-3కోట్లకు లోపే. బుక్ మై షోలో గంటకు కేవలం 1000 టికెట్స్ బుక్ అయ్యాయి. ఆఫ్ లైన్ లో కూడా స్పందన కనిపించలేదు.
మంచి సినిమాను కావాలనే నెగిటివ్ చేశారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అలుపెరగని యుద్ధం చేశారు. ఎలాగైనా ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి తేవాలని ప్రయాసపడ్డారు. చివరికి జనసేన, కూటమి నేతలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. కొందరు నేతలు విద్యార్థులకు ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వేములవాడలో బీజేపీ నేతలు జులై 30న శివరామకృష్ణ థియేటర్లో ఉచితంగా నాలుగు షోలు ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించారు. సినిమా ఉద్దేశం మంచిది అని భావిస్తున్న నేతలు ఈ విధంగా ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: వార్ 2 తో యుద్ధం చేయనున్న కూలీ…లోకేష్ భారీ ప్లాన్ వేశాడా..?
కాగా గతంలో బాలకృష్ణ సినిమాకు ఇలానే ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్స్ ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాలకు కనీస ఆదరణ దక్కలేదు. చెప్పాలంటే బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు కరువయ్యారు. లాభాపేక్ష ఆలోచించకుండా ఎన్టీఆర్ జీవితగాథను జనాలకు తెలియజేయాలని బాలయ్య.. ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ లో ఎన్టీఆర్ బయోపిక్స్ ఉచితంగా ప్రదర్శించారు.