Coolie Trailer Release Date: లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ(Cooli) సినిమా ఆగస్టు 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో అటు లోకేష్ కనకరాజు, ఇటు రజనీకాంత్ ఇద్దరు మంచి నమ్మకంతో ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి చేయబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది.తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి బజ్ అయితే ఉంది. కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ (Vikram) సినిమా మంచి విజయాన్ని సాధించడం వల్లే ఈయనకు పాన్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది. అలాగే రజనీకాంత్ సైతం ‘జైలర్’ (Jailer) సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు వీళ్లిద్దరి కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందో తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంత ఆసక్తి చూపిస్తున్నారు…ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల్ని అలరించింది. దాంతోపాటుగా ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటూ ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు.
Also Read: మొన్న ‘ఎయిర్ ఇండియా’.. ఇప్పుడు TCS.. అసలు TATA కంపెనీలకి ఏమవుతుంది?
మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది. థియేటర్ కి రప్పించే అంత కెపాసిటి ట్రైలర్ లో ఉంటుందా? లోకేష్ కనకరాజు చేయబోతున్న ఈ మ్యాజిక్ వల్లే సినిమా మీద బజ్ అనేది పెరుగుతుందా? లేదంటే తగ్గిపోతుందా? అనేది తెలుస్తోంది. తద్వారా ఈ సినిమా ట్రైలర్ మీదనే అంత డిపెండ్ అయి ఉంటుంది.
ట్రైలర్ ని అద్భుతంగా వదిలితే ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. అలా కాకుండా నార్మల్ గా ఉంటే మాత్రం సినిమా మీద హైప్ తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ట్రైలర్ లో రజినీకాంత్ కి నాగార్జునకి మధ్య ఉన్న కొన్ని షాట్స్ ను రివిల్ చేస్తూ వాళ్లిద్దరి క్యారెక్టర్లు రివిల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…రజనీకాంత్ చేస్తున్న ఈ సినిమా మీదనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
కానీ లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబోలో సినిమా వస్తుంది అనగానే అందరిలో ఒక అటెన్షన్ అయితే వచ్చింది. నిజానికి వింటేజ్ రజనీకాంత్ ను కనక చూపించినట్టయితే సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని అతని అభిమానులు సైతం భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు… అయితే లోకేష్ కనకరాజ్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీదనే ఆయన కెరియర్ డిపెండ్ అయి ఉంది…