Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. కాగా గత ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఈ సీజన్ లో ఏడు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ సంప్రదాయానికి చెక్ పెట్టిడు బిగ్ బాస్. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి మేల్ కంటెస్టెంట్ గా సందీప్ నిలిచాడు. అంతేకాదు ఏడు వారాలు నామినేషన్స్ లోకి రాకుండా బిగ్ బాస్ హిస్టరీ లోనే లేని రికార్డు సృష్టించాడు సందీప్.
మొదటి వారం పవర్ అస్త్ర సాధించి ఐదు వారాల ఇమ్యూనిటీ పొందాడు.ఆరో వారం సందీప్ నుంచి సందీప్ తప్పించుకున్నాడు.కాగా సెవెంత్ వీక్ లో గౌతమ్ అశ్వద్ధామ 2.0 అంటూ నామినేషన్స్ లో ఉన్న సందీప్ ని సేవ్ చేశాడు. ఇక గత వారం మొదటి సారి నామినేషన్స్ లో నిలిచిన సందీప్ అతి తక్కువ ఓట్లు రావడంతో హౌస్ కి గుడ్ బై చెప్పేసాడు.
అయితే సందీప్ దాదాపు రెండు నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ టాప్ 5 లో ఉంటాడు అనుకున్న సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే తన భార్య జ్యోతి రాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన భర్తను సపోర్ట్ చేస్తూ వచ్చింది. కచ్చితంగా విన్నర్ గానే బయటికి వస్తాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. సందీప్ ఎలిమినెట్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్త పై ప్రేమను చాటుకుంది.
ఇంటికి వచ్చిన సందీప్ కి భోజనం తినిపిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. జ్యోతి రాజ్ తన ఇన్ స్టా అకౌంట్ లో భర్త గురించి ‘బిగ్ బాస్ హౌస్ లోకి చాలా బలంగా వెళ్లావ్ .. గట్టి పోటీ ఇచ్చావ్ .. అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకున్నావ్ . అంతే స్ట్రాంగ్ గా బయటకు వచ్చావ్.. ఇది మాత్రమే అంతం కాదు. అని పోస్ట్ చేసింది.ఇది చూసిన ఫ్యాన్స్ సందీప్ కు మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే సందీప్ ఎనిమిది వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు దాదాపు 22 లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.