RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ముందుకు వచ్చింది. దీనిపై అందరిలో అంచనాలు భారీగా పెరిగాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూవీపై ట్వీట్ చేశారు. ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు. సినిమాకు మంచి స్పందన తీసుకొచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరారు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో తీయడంతో సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మానియాతో అటు ఫ్యాన్స్ ఇటు సెలబ్రిటీలు సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ ట్రిపుల్ సినిమా రికార్డుల పరంపర కొనసాగించాలని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. రౌద్రం రణం రుధిరం సినిమా ప్రేక్షకుల అంచనాలు మించి సందడి చేయాలని ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనతో మరింత క్రేజ్ సంపాదించుకుంటారని తెలుస్తోంది.
Also Read: RRR Craze: ఓవర్సీస్, దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్
ఈ సందర్భంగా మెగా హీరో వరణ్ తేజ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఓ చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉందని అద్భుతంగా తీశారని కొనియాడారు. భారతీయ సినిమా గర్వించే విధంగా ఉందని ప్రశంసించారు. రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ మూవీ చాలా బాగుందని నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు ట్రిపుల్ ఆర్ మూవీకి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ఆనంద్ కూడా ఈ సినిమా గర్వించేలా ఉందని ట్వీట్ చేశారు. సినీ రంగంలో దర్శకుడు రాజమౌళిని ఢీకొనే దర్శకుడు లేరని ప్రశంసించారు. ట్రిపుల్ ఆర్ టీంకు ధన్యవాదాలు తెలిపారు. తమిళ నటుడు శివకార్తికేయన్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కు శుభాభినందనలు తెలియజేశారు.
Also Read: RRR Movie: చంద్రబాబు ఇలాకాలో ఆర్ఆర్ఆర్ లొల్లి.. ఘర్షణ
Recommended Video:
[…] Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరో… […]
[…] Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరో… […]
[…] Celebrities Heap Praise On RRR: సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ జాతర షురూ అయిపోయింది. ఎక్కడ చూసినా.. ఎవరిని కదిలించినా త్రిపుల్ ఆర్ మేనియానే కనిపిస్తోంది. అందరూ ఊహించినట్టుగానే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ కోసం సామాన్య జనమే కాకుండా.. సినీ జనాలు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా చూసిన చాలామంది హీరోలు, దర్శకులు ఈ మూవీపై స్పందించారు. […]
[…] […]
[…] […]
[…] Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరో… […]
[…] SS Rajamouli RRR Movie: నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. అన్ని వర్గాల సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి తెరకెక్కించిన మాయాజాలం.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీకు మొదటి నుంచి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. పైగా ఇండస్ట్రీలో నందమూరి, మెగా ఫ్యామిలీలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు కలిసి నటించడం అంటే మామూలు విషయం కాదు. […]
[…] Megastar Shocking Review On RRR: తెలుగు వెండితెరపైనే బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అందుకే.. ఈ సినిమా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది ‘ఆర్ఆర్ఆర్’ . రాజమౌళి బృందం రికార్డు స్థాయి సక్సెస్ సాధించడం పై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. […]