High Court notices to Nayanthara: నయనతార(Nayanthara) అంటే వివాదాలు..వివాదాలు అంటే నయనతార అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈమె పెళ్లి చేసుకున్నా వివాదమే, ఇద్దరు కవలపిల్లలకు తల్లి అయినా వివాదమే, చివరికి ఈమె పెళ్లి డాక్యుమెంటరీ వీడియో కూడా ఒక వివాదమే. ఈ డాక్యుమెంటరీ లో తన అనుమతి తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ అనే చిత్రం మేకింగ్ సమయం లోని ఒక వీడియో ని ఉపయోగించుకున్నందుకు ఆ చిత్ర నిర్మాత ధనుష్ ఫైర్ అయ్యి, నయనతార పై హై కోర్టు లో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద వివాదాస్పదడంగా మారింది. సోషల్ మీడియా లో ఈ అంశం పై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. స్వయంగా నయనతార ధనుష్ కి కౌంటర్ ఇస్తూ రెండు పేజీల బహిరంగ లేఖ రాసింది. అంత దూరం వెళ్ళింది ఈ వ్యవహారం.
ఇప్పుడు చంద్రముఖి మూవీ మేకర్స్ కూడా నయనతార పై హై కోర్టులో కేసు వేశారు. తమ అనుమతి లేకుండా నయనతార చంద్రముఖి మేకింగ్ వీడియో లోని క్లిప్ ని వాడుకుందని కోర్ట్ కంప్లైంట్ లో నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని విచారించిన హై కోర్టు అక్టోబర్ 6 లోపు సమాధానం గా కౌంటర్ పిటీషన్ రావాలని, లేదంటే తీవ్రమైన పరిమాణామాలను ఎదురుకోవాల్సి ఉంటుందని నయనతార మరియు నెట్ ఫ్లిక్స్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది. మరి దీనికి నయనతార ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. ఆమెకు కేవలం జరిమానా విధించి వదిలేస్తారా?, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే సందేహాలు ఇప్పుడు అభిమానుల్లో ఉన్నాయి. అరెస్ట్ వరకు మ్యాటర్ వెళ్లే అవకాశాలు లేవు. జరిమానా తోనే సదుకునేలా అనిపిస్తుంది. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇకపోతే నయనతార లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . గత కొంతకాలం గా ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది . నయనతార కి మెగాస్టార్ చిరంజీవి తో ఇది మూడవ సినిమా. సాధారణంగా ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి అసలు ఆసక్తి చూపించని హీరోయిన్స్ లో మొదటి వరుస లో కూర్చునే వారిలో ఒకరు నయనతార. ఒక సినిమాకు సంతకం చేసే ముందు ఈ కండీషన్ మీదనే ఆమె సంతకం చేస్తుంది. కానీ మొట్టమొదటిసారి చిరంజీవి సినిమా కోసం ఆమె తానూ గీసుకున్న ఆ హద్దులన్నీ చెరిపేసి ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధమైంది. అనిల్ రావిపూడి సంగతి మన అందరికి తెలిసిందే. సినిమా దగ్గర పడిందంటే ఆయన ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనమంతా చూసాము. ఇక ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి.
మరోసారి చిక్కుల్లో నయనతార
నయనతార డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమా క్లిప్‌ను వాడారని హైకోర్టుకు వెళ్ళిన నిర్మాతలు
తమ అనుమతి లేకుండా సినిమాలో క్లిప్‌ను వాడటంపై పిటిషన్
అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని నయనతారకు, నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు pic.twitter.com/iX86uDaGBK
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2025