Dhanush: ప్రముఖ తమిళ హీరో ధనుష్(Dhanush k Raja) ఈమధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా ఈయన ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ అంశం పై సోషల్ మీడియా లో ప్రతీ రోజు వందల కొద్దీ ఆర్టికల్స్ ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఇది నిజమా, కాదా అనేది పక్కన పెడితే, ధనుష్ ఇప్పుడు మరో సంఘటన కారణంగా వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కొన్నేళ్ల క్రితం ధనుష్ ‘నాన్ రుద్రన్’ అనే సినిమా చేయడం కోసం తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ నుండి అడ్వాన్స్ కూడా అందుకున్నాడు. ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ధనుష్ ఇప్పటి వరకు ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేదట. అనేక సార్లు ఆయన్ని సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.
దీంతో అసహనానికి గురైన నిర్మాతలు హై కోర్టు ని ఆశ్రయించి 20 కోట్ల జరిమానా ని ధనుష్ తమకు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు ఇప్పించారు. అంటే తాము ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులకు వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. మరి ఈ లీగల్ నోటీసులకు ధనుష్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి. తాను నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమాలో, తన పెళ్లి వీడియోలో కేవలం ఒక్క షాట్ ని ఉపయోగించినందుకు నయనతార కి కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించి జరిమానా కట్టాలంటూ డిమాండ్ చేసిన ధనుష్, ఇలా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని, సినిమా చేయకపోవడం అన్యాయమే కదా, ఒక నిర్మాతగా ఆయన ఇలాంటి పనులు ఎలా చేయగలడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది ధనుష్ ని నిలదీస్తున్నారు. మరి ధనుష్ నుండి ఈ అంశం పై రెస్పాన్స్ వచ్చే వరకు, ఎవరు ఈ విషయం లో కరెక్ట్ అనేది చెప్పలేము అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ధనుష్ సాధారణంగా ఇలాంటి వాటిపై రెస్పాన్స్ ఇవ్వడం అనేది గతం లో ఎప్పుడూ కూడా మనం చూడలేదు. నయనతార పై ఈయన కాపీ రైట్స్ కేసు వేసినప్పుడు, ఆమె చాలా ఆవేశంగా ధనుష్ ని నిందిస్తూ అనేక కామెంట్స్ చేసింది. కానీ ధనుష్ వైపు నుండి ఆ కామెంట్స్ కి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఆయన అలాగే సైలెన్స్ మైంటైన్ చేస్తాడా?, నయనతార విషయం లో ధనుష్ తప్పేమి లేదని, ప్రొఫెషినల్ గా వెళ్లాడని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన మీద వచ్చిన అభియోగంలో మాత్రం ధనుష్ వైపే తప్పు చూపిస్తోంది. కాబట్టి దీనిపై ఆయన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి స్పందిస్తాడో లేదో చూడాలి.