High Court Shock To OG Producer: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ(They Call Him OG) నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ముందుకెళ్తుంది. ఈ చిత్రానికి విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, బెనిఫిట్ షోస్ ప్రదర్శించుకోవడానికి అనుమతిని ఇస్తూ జీవోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా తెలంగాణ లోని మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి ఓజీ టికెట్ రేట్స్ పెంచడం పై నిరసన తెలుపుతూ, తక్షణమే తగ్గించాలని, ఇష్టమొచ్చిన రేట్లకు టిక్కెట్లు అమ్మి జనాలను దోచుకుంటున్నారని పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన హై కోర్టు మొదట్లో ఓజీ టికెట్ రేట్స్ పెంపు ని వ్యతిరేకిస్తూ, జీవో వెంటనే సప్సెన్స్ చేస్తున్నట్టు ఆర్డర్లు జారీ చేసింది. కానీ అప్పటికే టికెట్ రేట్స్ విక్రయం భారీగా జరిగిపోవడం తో నిర్మాత దానయ్య తరుపున న్యాయవాది రివ్యూ కోరగా తమ తీర్పు లో ఎలాంటి మార్పు లేదని నేడు స్పష్టం చేసింది.
గత తీర్పుని అక్టోబర్ 9 వరకు కొనసాగుతుందని ప్రకటిస్తూ విచారణను అదే తేదికి వాయిదా వేసింది. దీంతో అక్టోబర్ 9 వరకు పెంచిన టికెట్ రేట్స్ వర్తించవు. అయితే దీని పై ట్విట్టర్ లో దానయ్య హ్యాండిల్ నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘తెలంగాణ లో ఓజీ టికెట్ రేట్స్ జీవో ని హై కోర్టు కేవలం మల్లేష్ యాదవ్ అనే వ్యక్తికి మాత్రమే రద్దు చేసింది. కాబట్టి, అతను అతని కుటుంబం నైజాం లో ఎక్కడ మా సినిమాని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ 100 టికెట్ రేట్స్ ని తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము’ అంటూ వ్యంగ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిని బట్టీ చూస్తుంటే టికెట్ రేట్స్ ని రద్దు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పకనే చెప్పారు మేకర్స్. కాబట్టి అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
మొదటి రోజు దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఓజీ చిత్రం, రెండవ రోజు కూడా ప్రతీ చోట డీసెంట్ స్థాయి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది. మ్యాట్నీస్ నుండి బాగా పికప్ అయ్యింది, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ సినిమాకు రెండవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చూస్తుంటే వీకెండ్ కి 300 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.