తమిళనాడు రాజకీయాలు.. కూటములు ఇప్పుడే మొదలయ్యాయి. డీఎంకే అధికార కూటమి చాలా స్ట్రాంగ్ అనుకున్నాం.. కానీ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆందోళన నెలకొంది. టీవీకే విజయ్ జోష్ ఎక్కువగా ఉండడం తమిళనాట పార్టీలను కలవరపెడుతోంది.
డీఎంకేలో మొత్తం 10 పార్టీలు కూటమిగా చివరిసారి పోటీ చేసి గెలిచాయి.ఇందులో డీఎంకే, కాంగ్రెస్ లు పెద్ద పార్టీలు. తమిళనాట రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే జోసెఫ్ విజయ్ ర్యాలీల మీద ర్యాలీలు విధిస్తే కాంగ్రెస్ ఖండించింది. విజయ్ కు మద్దతుగా నిలిచి మాట్లాడాడు.
ఒకవైపు డీఎంకేపై సీట్లు ఎక్కువ కావాలని కాంగ్రెస్ ఒత్తిడి పెడుతూనే విజయ్ ను చేరదీసే పనిలో కాంగ్రెస్ పడింది. విజయ్ వైపు కాంగ్రెస్ మళ్లేలా కనిపిస్తోంది. పవర్ ఫుల్ క్రిస్టియన్ లాబీ ఓట్లు ఇటు కాంగ్రెస్ కు కొత్తగా విజయ్ వైపు ఉన్నాయి. అందుకే అందరినీ విమర్శించి కాంగ్రెస్ ను మాత్రం విజయ్ ఇంతవరకూ విమర్శించలేదు.
దూసుకుపోతున్న జోసెఫ్ విజయ్, బీజేపీలో ఒంటరిగా అన్నామలై.. తమిళ రాజకీయాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
