Hi Nanna Collection: హాయ్ మూవీ బాక్సాఫీస్ స్ట్రగుల్ అవుతుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్ర కలెక్షన్స్ పరంగా నిరాశపరుస్తుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్న చిత్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. మదర్, డాటర్ సెంటిమెంట్ కి లవ్ యాంగిల్ జత చేసి ఫీల్ గుడ్ మూవీ రూపొందించారు. ఫస్ట్ షో నుండే హాయ్ నాన్న చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. మేజర్ వెబ్ సైట్స్ సూపర్ హిట్ రేటింగ్ ఇచ్చాయి. వసూళ్లు టాక్ కి భిన్నంగా ఉన్నాయి.
ఫస్ట్ డే హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 2.91 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది నాని కెరీర్ లోయస్ట్ కావడం విశేషం. నాని కెరీర్లో డిజాస్టర్ గా ఉన్న అంటే సుందరానికీ చిత్రం కూడా రూ. 3.87 కోట్ల ఏపీ/తెలంగాణ ఫస్ట్ డే వసూళ్లు రాబట్టింది. నాని కెరీర్లో దసరా అత్యధికంగా రూ. 14 కోట్ల ఓపెనింగ్ డే వసూళ్లు రాబట్టింది. దసరాతో మిగతా నాని చిత్రాలకు పొంతనే లేదు.
ఇక శుక్రవారం హాయ్ నాన్న వసూళ్లు పరిశీలిస్తే… నిలకడగా ఉన్నాయి. అయితే ఇంప్రూవ్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు హాయ్ నాన్న రూ. 1.70 కోట్ల షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ రూ. 2.40 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజులకుగా రూ. 7.5 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసింది. మరో రెండు రోజుల్లో వీకెండ్ ముగియనుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే హాయ్ నాన్న డిజాస్టర్ కావడం ఖాయం.
హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, ఓవర్సీస్ తో కలిపి రూ. 27.60 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారని సమాచారం. దాదాపు రూ. 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో హాయ్ నాన్న బీరలో దిగింది. మరో రూ. 21 కోట్లకు పైగా వసూలు చేస్తే కానీ హిట్ ట్రాక్ ఎక్కదు. మిరకిల్ జరిగితే తప్ప హాయ్ నాన్న హిట్ కాదని క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ చిత్రంలో నానికి జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది.