Hi Nanna Collections: హీరో నాని మూవీస్ సెలక్షన్ అద్భుతం. ఫలితాలు మాత్రం దారుణం. ఈ మధ్య కాలంలో నాని నటించిన ప్రతి సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు మాత్రం పట్టించుకోవడం లేదు. నెగిటివ్ టాక్ తో మాస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. నాని చేస్తున్న క్లాసిక్స్ మాత్రం కాసులు కురిపించడం లేదు. హాయ్ నాన్న మూవీ ఓపెనింగ్స్ తో ఇది మరోసారి రుజువైంది. డిసెంబర్ 7న విడుదలైన హాయ్ నాన్న మూవీ నాని కెరీర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
హాయ్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో కనీస ప్రభావం చూపలేదు. నైజాం లో ఫస్ట్ డే రూ.1.64 కోట్లు, సీడెడ్ రూ.24 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.43 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలలో హాయ్ నాన్న రూ. 2.91 కోట్ల షేర్ రూ.5.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా రూ. 55 లక్షలు అందుకుంది. నాని చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పోటీపడుతూ రూ.2.05 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ హాయ్ నాన్న మొదటి రోజు రూ. 5.51 కోట్ల షేర్, రూ.10.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. నాని గత చిత్రాల ఓపెనింగ్స్ లో సగం మాత్రమే హాయ్ నాన్న రాబట్టింది. మొదటి రోజు దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.22 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే సుందరానికీ రూ. 3.87 కోట్లు, శ్యామ్ సింగరాయ్ రూ.4.17 కోట్లు, గ్యాంగ్ లీడర్ రూ. 4.47 కోట్లు వసూళ్లు అందుకుంది.
నానికి ఇది ఊహించని దెబ్బ. హాయ్ నాన్న చిత్రానికి మెజారిటీ సైట్స్ పాజిటివ్ రేటింగ్ ఇచ్చాయి. ఫలితం మాత్రం దెబ్బ తీసింది. మరి వీకెండ్ మరో మూడు రోజులు ఉంది. హాయ్ నాన్న పుంజుకుంటుందేమో చూడాలి. హాయ్ నాన్న చిత్రానికి శౌర్యు దర్శకుడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.