Homeఎంటర్టైన్మెంట్Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్.. వరుడు ఎవరో తెలుసా?

Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న మృణాల్ ఠాకూర్.. వరుడు ఎవరో తెలుసా?

Mrunal Thakur: సీతామహలక్ష్మీ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి చిత్రంతోనే అభిమానుల హృదయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకుందని చెప్పుకోవచ్చు. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా అద్భుతమైన నటనను కనబర్చింది.

తొలుత హిందీలో సీరియల్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ ‘జెర్సీ’ సినిమా రీమేక్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కథనాయకగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సీతారామం భారీ విజయాన్ని అందించడంతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో సీతామహాలక్ష్మీగా చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆమె కథనాయకగా, నాచురల్ స్టార్ నాని కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ హలో నాన్న’. ఈ చిత్రం కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మృణాల్ ఠాకూర్ తెలుగులో వరుస హిట్స్ అందుకున్నారని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తుంది ఈ భామ. ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే న్యూజెర్సీలో ఉన్న ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని పేర్కొంది. సీతారామం మూవీ నుంచి తనను తెలుగు ప్రేక్షకులు ఆదిరిస్తున్నారన్న మృణాల్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది.. ఆ సమయంలోనే అక్కడే ఉన్న పిల్లవాడు మీకు పెళ్లి అయిందా అని అడగడంతో చిరునవ్వు చిందించిన మృణాల్ త్వరలోనే చేసుకుంటా అని సమాధానం ఇచ్చారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular