spot_img
Homeఎంటర్టైన్మెంట్Hey Balwanth 3 Days Collections: 'హే బల్వంత్' 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Hey Balwanth 3 Days Collections: ‘హే బల్వంత్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే!

Hey Balwanth 3 Days Collections: సుహాస్(Actor Suhas) హీరోగా లేటెస్ట్ చిత్రం ‘హే బల్వంత్'(Hey Balvanth) ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కొంతమంది ఈ చిత్రానికి డివైడ్ టాక్ చెప్పిన విషయం వాస్తవమే కానీ , షోస్ గడిచే కొద్దీ అభిమానుల నుండి పాజిటివ్ రివ్యూస్ రావడం మొదలయ్యాయి. ఫలితంగా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ దక్కింది. కానీ లాంగ్ రన్ లో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ఏరుకుని అందుకోవాలంటే కచ్చితంగా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టడం అత్యవసరం. లేదంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాకు విడుదలకు ముందు 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

బుక్ మై షో యాప్ గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి నిన్న 15 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజు వసూళ్లతో పోలిస్తే మూడవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు నమోదు అవ్వడం గమనార్హం. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి మూడవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఓవరాల్ గా మూడవ రోజున ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తం మీద ఈ చిత్రానికి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2.8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాస్తవానికి ఈ సినిమా కి వచ్చిన పాజిటివ్ టాక్ కి , వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేయాలి , కానీ సగం కూడా రికవర్ అవ్వకపోవడం గమనార్హం.

ఎందుకో ఏ ఫిబ్రవరి నెల సినిమాలకు ఈ ఏడాది అసలు కలిసి రాలేదు. సంక్రాంతి సినిమాలకు జనాలు విపరీతంగా ఖర్చు చేయడం వాళ్ళో ఏమో తెలియదు కానీ , పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కదలడం లేదు . ఇప్పుడు ఈ ‘హే బల్వంత్’ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని డాట్ సూపర్ హిట్ అనిపించుకోవాలంటే ఈ వారం కచ్చితంగా బాగా ఆడాల్సిందే . లేదంటే టార్గెట్ చేరుకోవడం కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version