Homeఎంటర్టైన్మెంట్Hey Balvanth Box Office Collection: 'హే బలవంత్' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Hey Balvanth Box Office Collection: ‘హే బలవంత్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. జాక్ పాట్ కొట్టేసిన సుహాస్!

Hey Balvanth Box Office Collection: సుహాస్(Actor Suhas) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హే బల్వంత్'(Hey Balvanth) ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని, డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, షేర్ వసూళ్లు దాదాపుగా కోటిన్నర వరకు వచ్చిందని అంటున్నారు. ఇక ఆడియన్స్ లో పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో రెండవ రోజు ఈ చిత్రానికి అనేక ప్రాంతాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేకపోవడం గమనార్హం. మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 15 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.

ఇక రెండవ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని చూస్తుంటే, కచ్చితంగా ఈ సినిమాకు 18 వేల టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, రెండవ రోజు కోటి కి పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇది నిజంగా జాక్పాట్ అనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ తర్వాత ఈ నెలలో విడుదలైన ఏ సినిమా కూడా జనాలను పెద్దగా అలరించకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగా పుంజుకున్నాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిలేరియస్ గా ఉండడం బాగా కలిసొచ్చింది.

ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. రేపటి తో ఈ చిత్రం 5 కోట్ల మార్కుని దాటనుంది. మొదటి వారం పూర్తి అయ్యేలోపే బ్రేక్ ఈవెన్ మార్కుని కచ్చితంగా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇందులో ఎంత వరకు నిజం అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular